అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) తన అక్టోబర్ 2025 మానిటరీ పాలసీ సమావేశంలో మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. జెరోమ్ పావెల్ నేతృత్వంలోని ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) 25 బేసిస్ పాయింట్లు తగ్గించి వడ్డీ రేట్లను 3.75% నుండి 4.00 శాతం పరిధికి చేర్చింది. ఈ నిర్ణయం అక్టోబర్ 29, 2025న విడుదలైన అధికారిక ప్రకటన ద్వారా వెల్లడైంది. ఇది 2025లో రెండోసారి వడ్డీ రేట్లలో కోత. సెప్టెంబర్ 2025లో మొదటిసారిగా రేట్లు తగ్గించిన ఫెడ్, ఇప్పుడు ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అలాగే అమెరికా ప్రభుత్వ మూత (shutdown) కారణంగా ఆర్థిక డేటా లభ్యం కాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.
ఫెడ్ సభ్యులలో 10 మంది ప్రస్తుత నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. ఒకరు 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించాలని కోరగా, మరొకరు రేట్లను యథాతథంగా ఉంచాలని సూచించారు. దేశ ఆర్థిక దృక్పథం, నష్టాల సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఫెడరల్ నిధుల రేటు లక్ష్య పరిధిని 0.25 శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు తగ్గించామని FOMC పేర్కొంది.

డిసెంబర్ 2025 సమావేశంలో మరొక వడ్డీ రేటు తగ్గింపు ఉంటుందా అన్న ప్రశ్నపై చైర్మన్ జెరోమ్ పావెల్ స్పందించారు. డిసెంబర్‌లో మరో రేటు కోత ముందుగానే నిర్ణయించబడింది అనుకోవడం తప్పు. అది పూర్తిగా ఇన్‌కమింగ్ ఆర్థిక డేటాపైనే ఆధారపడి ఉంటుందని పావెల్ స్పష్టం చేశారు. అంటే, భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉండవచ్చు కానీ అవి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మాత్రమే ఉంటాయని ఆయన చెప్పారు.
జెరోమ్ పావెల్ తన ప్రసంగంలో దేశంలో వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతోందని తెలిపారు. సెప్టెంబర్ 2025తో ముగిసిన ఏడాదిలో వినియోగదారుల ధర సూచీ (CPI) ద్రవ్యోల్బణం 2.9 శాతం నుండి 3 శాతానికి పెరిగింది. ట్రంప్ ప్రభుత్వం విదేశీ వస్తువుల దిగుమతులపై సుంకాలు పెంచడం వల్ల వస్తువుల ధరలు ఎగసి ద్రవ్యోల్బణం పెరిగిందని పావెల్ అన్నారు. సుంకాల పెరుగుదల వస్తువుల ధరలను పెంచింది. ఇది దీర్ఘకాల ద్రవ్యోల్బణ ధోరణిని తారుమారుచేస్తుందని ఆయన హెచ్చరించారు.
2025లో అమెరికా ఉద్యోగ వృద్ధి మందగించింది. నిరుద్యోగిత రేటు పెరిగిందని FOMC నివేదికలో పేర్కొంది. జెరోమ్ పావెల్ మాట్లాడుతూ వలసల సంఖ్య తగ్గిపోవడం వల్ల శ్రామికుల సరఫరా తగ్గిపోయింది. కొత్త ఉద్యోగాల అవసరం కూడా తగ్గిందని అన్నారు. ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన సూచించారు. దీని ఫలితంగా కార్మిక మార్కెట్ మందగించి, ఉద్యోగ సృష్టి వేగం తగ్గిందని తెలిపారు.
ఫెడ్ ప్రకారం, అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు దిశపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోందని అంగీకరించింది. ఆర్థిక దృక్పథం గురించి అనిశ్చితి ఎక్కువగా ఉంది. ఇన్‌కమింగ్ డేటా, రిస్క్‌లు, ఆర్థిక సమతుల్యత ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని FOMC పేర్కొంది. ఫెడ్ దీర్ఘకాల లక్ష్యం గరిష్ట ఉపాధి, 2 శాతం ద్రవ్యోల్బణం సాధించడం అని స్పష్టం చేసింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ యొక్క తాజా వడ్డీ రేటు కోత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, రాజకీయ అస్థిరతల నేపథ్యంలో ఫెడ్ భవిష్యత్‌లో మరిన్ని సడలింపులు ఇవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు.అయితే, పావెల్ వ్యాఖ్యల ప్రకారం, ఫెడ్ ఇకపై ప్రతి నిర్ణయాన్ని డేటా ఆధారంగా జాగ్రత్తగా తీసుకుంటుంది.
More From GoodReturns

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

Credit card EMI: క్రెడిట్ కార్డ్ బిల్లును EMI గా మార్చడం లాభమా? నష్టమా?

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..



Click it and Unblock the Notifications