అమెరికా: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ బుధవారం మరోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. క్రితంసారి వడ్డీ రేట్లు తగ్గించినప్పుడే మరోసారి తగ్గింపుపై ఓ విధంగా హింట్ ఇచ్చింది. తాజాగా, బుధవారం 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ ఏడాది ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం ఇది మూడోసారి.
అమెరికాలో ఇప్పటి వరకు కీలక వడ్డీ రేట్లు 1.75 శాతం నుంచి రెండు శాతం మధ్య ఉన్నాయి. ఈ రేట్లను పావు శాతం తగ్గిస్తున్నట్టు బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించారు. ఎగుమతులు, వ్యాపార వాతావరణం అంత అనుకూలంగా లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చేసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్టు ఫెడ్ రిజర్వ్ సంకేతాలు ఇచ్చింది.

ప్రస్తుత వడ్డీ రేటు తగ్గింపుతో అమెరికాపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం తగ్గుతుందని భావిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోకుండా అడ్డుకుంటుందని అంచనా వేస్తున్నారు. తాజా నిర్ణయం నేపథ్యంలో మరోసారి మాత్రం వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చు. ప్రస్తుత తగ్గింపుతో వడ్డీ రేట్లు 1.50 శాతం నుంచి 1.75 శాతం మధ్య ఉన్నాయి.
తగ్గింపు నిర్ణయంపై వచ్చే స్పందనను విశ్లేషించి ఆర్థిక అంచనాలు తయారు చేస్తామని ఫెడ్ బ్యాంకు చైర్మన్ వెల్లడించారు. ఫెడ్ అంచనాల ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. ఉద్యోగ మార్కెట్ బలంగా ఉంది. ఆర్థిక కార్యకలాపాల రేటు కూడా పెరిగింది.
More From GoodReturns

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

Bengaluru: బిజినెస్ చేయాలని ఉన్నా ధైర్యం సరిపోవట్లేదా? మీరు కూడా ఈ ట్రాప్లో ఉన్నారేమో చూసుకోండి!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications