US Fed News: ట్రంప్ గ్రాండ్ విక్టరీ తర్వాత తొలిసారిగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. గత సెప్టెంబర్ నాటి పాలసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్ల కోతకు వెళ్లిన ఫెడ్ ఈ సారి మాత్రం అంత సాహసం చేయలేదు. అయితే రేట్ల తగ్గింపును కొంత నెమ్మదింపజేసింది.
వివరాల్లోకి వెళితే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ చైర్మన్ పావెల్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత ఆచితూచి అడుగులువేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిపుణులు ఈహించినట్లుగానే ఆయన వడ్డీ రేట్ల తగ్గింపును 25 బేసిస్ పాయింట్లుగా ఈ సారి నవంబర్ 6,7 తేదీల్లో జరిగిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశంలో నిర్ణయించారు. దీంతో హోమ్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ వంటి వినియోగదారులకు కొత ఊరట లభించనుంది. JP మోర్గాన్, బార్క్లేస్, గోల్డ్‌మన్ సాచ్ విశ్లేషకులు రేటు తగ్గింపును ముందుగానే ఊహించారు.

ఈసారి వడ్డీ రేట్లను తగ్గించటానికి గల కారణాన్ని వివరిస్తూ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలసీ రేట్ల తగ్గింపు అంటే తగ్గుతున్న నిరుద్యోగం రేటుతో పాటు అమెరికాలో ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనంపై తమకు పెరిగిన విశ్వాసంగా చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక కార్యకలాపాలు నిరంతరం బలమైన వేగంతో పెరుగుతున్నాయని పావెల్ ఈ సందర్భంగా వెల్లడించారు. రేట్ల తగ్గింపు జోరు అమెరికా స్టాక్ మార్కెట్లలో స్పష్టంగా కనిపించింది. అవును ట్రంప్ విజయంతో విజృంభించిన యూఎస్ మార్కెట్లలో ఆ బుల్ జోరు మరింతగా పెరగటానికి ఫెడ్ పాలసీ రేట్ కచ్ ఆజ్యం పోసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా ట్రంప్ గెలుపు తర్వాత వడ్డీ రేట్ల భవిష్యత్తులో పెరగటానికి అవకాశం ఉందనే వాదనలు సైతం నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి కారణం కొత్త అధ్యక్షుడు అమెరికాకు చైనాతో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా సుంకాలు పెంచుతారని అది ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని భారీగా ప్రేరేపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ స్టాక్ మార్కెట్లు మాత్రం తమ నష్టాల పరంపరను నిన్నటి నుంచి కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీల పనితీరును గమనిస్తే ఉదయం 9.45 గంటల సమయంలో మార్కెట్లు ఆరంభ నష్టాల నుంచి కొంత తేరుకోవటంతో సెన్సెక్స్ 52 పాయింట్ల నష్టంతో ఉండగా, నిఫ్టీ 15 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 98 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 62 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతోంది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications