US Fed Rate Cut: గడచిన రెండు మూడు రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్లతో పాటు గ్లోబల్ మార్కెట్లు అమెరికా ఫెస్ సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు నిర్వహిస్తున్న ఎఫ్ఓఎంసీ సమావేశంలో ఫెడ్ ఛైర్ పావెల్ వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రకటన చేస్తారనే ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ముచ్చటగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించటం అందరిలోనూ ఊరటను కలిగిస్తోంది.
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తాజాగా డిసెంబరు 18 బుధవారం నాడు వరుసగా మూడవసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ఇది 2024 చివరి ద్రవ్య విధాన ఫలితం కావటంతో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు జెరోమ్ పావెల్ ప్రకటించారు. దీంతో మొత్తం వడ్డీ రేట్లను మూడు దఫాలుగా ఫెడ్ 100 బేసిస్ పాయింట్ల మేర ట్రిమ్ చేసింది. అలాగే 2025లో కూడా వడ్డీ రేట్ల కోతలు కొనసాగుతాయని పావెల్ తాజా సమావేశంలో సంకేతాలు ఇచ్చారు. FOMC దాని లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి, ఫెడరల్ ఫండ్స్ రేటు కోసం లక్ష్య పరిధిని 1/4 శాతం పాయింట్ల 4.25 నుండి 4.50 శాతానికి తగ్గించాలని కమిటీ నిర్ణయించింది. 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా కొనసాగటం గమనార్హం.

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని దీర్ఘకాలంలో 2శాతం చొప్పున సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం, ఉపాధి లక్ష్యాలను సాధించటంలో ఫెడ్ బ్యాలెన్స్డ్ మూవ్ కలిగిఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు కొన్ని రోజుల కిందట సెంట్రల్ బ్యాంక్ చైర్ జెరోమ్ పావెల్ అమెరికా ఎకానమీ బలంగా ఉందని చేసిన కీలక వ్యాఖ్యలకు అనుగుణంగా ప్రస్తుతం రేట్ల తగ్గింపు కొనసాగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో ఏడాది ప్రారంభం నుంచి లేబర్ మార్కెట్ మంచి రోజులు చూస్తోందని, అయితే నిరుద్యోగిత రేటు మాత్రం కొంత పెరిగినప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉన్నట్లు వెల్లడించబడింది.
రానున్న ఫెడ్ సమావేశాల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఎలాంటి హడావిడి లేకుండా వడ్డీరేట్లను నెమ్మదిగా తగ్గించే అవకాశం ఉన్నట్లు ఎఫ్ఓఎంసీ సమావేశంలో పావెల్ సంకేతాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు గణాంకాలకు అనుగుణంగా తగిన స్థాయిలో నిర్ణయాలు ఉంటాయని, ఇది ఆందోళనలను అరికట్టడంలో దోహదపడుతుందని సమావేశంలో వెల్లడించబడింది. ద్రవ్య విధానం సరైన వైఖరిని అంచనా వేయడం, కమిటీ ఆర్థిక దృక్పథం కోసం ఇన్‌కమింగ్ సమాచారం ద్వారా చిక్కులను పర్యవేక్షించడం కొనసాగించాలని ఎఫ్ఓఎంసీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఆర్థిక, అంతర్జాతీయ డెవలప్మెంట్స్, ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణ అంచనాలు వంటి కీలక అంశాలను నిరంతరం పరిశీలించి తదనుగుణంగా చర్యలు ఉంటాయని ఫెడ్ తాజా సమావేశంలో వెల్లడించటం గమనార్హం. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు ఎలా మారతాయనే అంశం వేచిచూడాల్సిందే. దీని ప్రభావం రానున్న సమావేశంలో కనిపించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications