Fed Rate Hike: ఒకపక్క అమెరికా మాంద్యంలోకి జారుకుంటున్నట్లు కీలక సూచికలు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. మరో పక్క ఇవేవీ పట్టనట్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ నేడు తన వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇవి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తాజా మానిటరీ చర్యల్లో భాగంగా మరోసారి వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచారు. ఈ క్రమంలో సెంట్రల్ బ్యాంక్ సిబ్బంది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మాంద్యం గురించి అంచనా వేయడం లేదని వెల్లడించారు. ఈ సంవత్సరం చివరలో వృద్ధిలో గుర్తించదగిన మందగమనం ఉంటుందని వారు చెబుతున్నరు. అయితే వారు US ఆర్థిక వ్యవస్థ అవకాశాలపై మరింత ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫెడ్ నిర్ణయంతో ఇండియా మార్కెట్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.

ఫెడ్ సిబ్బంది అంచనాల ప్రకారం తాజా వడ్డీ రేట్ల పెంపులు భారతదేశంతో సహా ఇతర ప్రపంచ మార్కెట్‌లకు కూడా మేలు చేస్తుందని తెలుస్తోంది. అయితే ఫెడ్ తాజా రేట్ల పెంపు కారణంగా వడ్డీ రేట్లు 22 ఏళ్లలో ఎన్నడూ చూడని గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా రుణాలు మరింత ఖరీదుగా మారతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరోక్షంగా ఇది మార్కెట్లో డబ్బు సర్క్యులేషన్ తగ్గించి.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు దోహదపడుతుందని వారు చెబుతున్నారు.
వడ్డీ రేట్ల పెంపు వల్ల ఎక్కువ మంది తమ డబ్బును డిపాజిట్ల రూపంలో దాచుకునేందుకు మెుగ్గుచూపుతారని నిపుణులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో రానున్న కాలంలో రేట్ల పెంపులు అప్పటి డేటాకు అనుగుణంగా ఉంటాయనే సంకేతాలు ఫెడ్ ఇచ్చింది. ఎక్కువ మంది మాత్రం రానున్న కాలంలో పెద్దగా రేట్ల పెంపులు ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికా ఫెడ్ తర్వాత భారత సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ రేట్ల పెంపుకు వెళుతుందో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications