US News: ట్రంప్ ఎంట్రీ తర్వాత ఫెడ్ షాకింగ్ నిర్ణయం.. వడ్డీ రేట్ల తగ్గించేదే లే..!
Fed Pauses Rate Cut: గడతిన కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లతో పాటు పెట్టుబడిదారులు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ పాలసీ రేట్ల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనికి కారణం ట్రంప్ అధ్యక్షుడిగా రెండవసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మెుదటిసారి ఫెడ్ ద్రవ్య విధానాన్ని ప్రకటించటమే.
ట్రంప్ వాణిజ్య విధానాలపై ఉన్న అనిశ్చితుల కారణంగా ఫెడ్ కూడా జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో వడ్డీ రేట్ల తగ్గింపుకు పాజ్ ప్రకటించబడింది. వాస్తవానికి 2024లో ఫెడ్ ఏకంగా 100 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత ప్రస్తుత ప్రకటన రావటం గమనార్హం. ఫెడ్ అమెరికాలో ఉపాధి అకవశాల పెంపుతో పాటు ద్రవ్యోల్బణాన్ని రానున్న కాలంలో 2 శాతానికి తీసుకురావటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

వాస్తవానికి గడచిన డిసెంబరులో అమెరికాలో ద్రవ్యోల్బణం 2.9 శాతానికి పెరుగుదలను నమోదు చేసింది. వాస్తవానికి ఇది 2024 నవంబరులో 2.7 శాతం కంటే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఫెడ్ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం 2 శాతానికి తీసుకురావటానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వడ్డీ రేట్ల విషయంలో పావెల్ కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఉపాది, ద్రవ్యోల్బణం అంశాలపై ఉన్న ఆందోళనలపై ఫెడ్ తన శ్రద్ధను కొనసాగిస్తున్నట్లు జనవరి 30న ఫెడ్ కమిటీ మిటింగ్ వెల్లడించింది.
ఆర్థిక కార్యకలాపాలు పటిష్టమైన వేగంతో కొనసాగుతున్నాయని ఇటీవలి సూచికలు సూచిస్తున్నాయని ఫెడ్ తాజా మానిటరీ సమావేశంలో వెల్లడించింది. దీని కారణంగా ఇటీవలి నెలల్లో నిరుద్యోగిత రేటు తక్కువ స్థాయిలో స్థిరంగా కొనసాగుతోందని ఫెడ్ వెల్లడించింది. కార్మిక మార్కెట్ పరిస్థితులు పటిష్టంగా ఉండగా.. ద్రవ్యోల్బణం మాత్రం కొంతవరకు పెరిగిందని ఫెడ్ ప్రకటించింది. అందుకే ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లక్ష్యానికి తిరిగి తీసుకురావడానికి కమిటీ కట్టుబడి ఉందని, తీవ్రంగా ప్రయత్నిస్తోందని వెల్లడించింది.
FOMC ట్రెజరీ సెక్యూరిటీస్ ఏజెన్సీ డెట్, ఏజెన్సీ తనఖా-ఆధారిత సెక్యూరిటీల హోల్డింగ్‌లను తగ్గించడం కొనసాగిస్తుంది. భవిష్యత్ రేటు నిర్ణయాల కోసం జాబ్ మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం ఒత్తిడి, ద్రవ్యోల్బణం అంచనాలు, ఆర్థిక అంతర్జాతీయ పరిణామాలపై రీడింగ్‌లతో సహా ఇతర సమాచారాన్ని ఫెడ్ పరిగణనలోకి తీసుకుంటుంది. గతంలో ప్రకటించినట్లుగానే పావెల్ ఈ ఏడాది కేవలం రెండు రేట్ల తగ్గింపులకు మాత్రమే వెళ్లే అవకాశం ఉందని ప్రస్తుత ప్రకటనను బట్టి తెలుస్తోంది.


Click it and Unblock the Notifications