Fed Rate Announcement: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లతో పాటు అంతర్జాతీయంగా ఉన్న పెట్టుబడిదారులు ప్రధానంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రకటన చేస్తుందోనని ఆసక్తిగా వేచిచూశారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా మానిటరీ పాలసీలో పావెల్ నిర్ణయం నిజంగా మార్కెట్లకు కొత్త ఊపిరిపోసిందని చెప్పుకోవాలి. అమెరికా ద్రవ్యోల్బణం విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవటంతో బాగా ఆలోచించి పావెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు వెల్లడించారు. అయితే ఇలాంటి తరుణంలో రేట్ల పెంపుకు బదులు పావెల్ పాత రేట్లను యథాతథంగా కొనసాగించాలనుకోవటం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు కొంత ఉపశమనాన్ని అందించింది. దీనికి తోడు ఈ ఏడాది నవంబర్ తర్వాత రేట్ల తగ్గింపు ఉండే అవకాశం ఉందనే ఆశావాదాన్ని ఇంకా బలపరిచింది.

అయితే చాలా మంది మార్కెట్ ట్రేడర్లు ఈ ఏడాది తగ్గింపు సెప్టెంబరుకు ముందే ఉండొచ్చని అనుకుంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం బలంగా కొనసాగుతున్న వేళ పావెల్ రేట్లను 23 ఏళ్ల గరిష్ఠమైన 5.25-5.50 శాతం మధ్య కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే పాలసీ రేట్లలో కోత ఇప్పటికీ ద్రవ్యోల్బణంలో ట్రెండ్‌పై ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవలి స్థూల బలహీనత కారణంగా పెరుగుదల అసంభవంగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఫెడ్ రేట్ల ప్రకటన ధోరణి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో బుల్ పరుగులకు ఆజ్యం పోస్తోంది.
వాస్తవానికి మార్కెట్లు, నిపుణులు అంచనా వేసిన దాని కంటే చాలా మెల్లగా అమెరికా ద్రవ్యోల్బణం చల్లారుతోందని తాజా పరిస్థితులు చెబుతున్నాయి. ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ మాట్లాడుతూ ద్రవ్యోల్బణం ఇంకా చాలా ఎక్కువగా ఉందని అన్నారు. గొప్ప విశ్వాసాన్ని పొందేందుకు గతంలో ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రేట్ల తగ్గింపు తమ మదిలో లేదన్న పావెల్ అది పూర్తిగా ద్రవ్యోల్బణం డేటాపై ఆధారపడి ఉంటుందని కుండబద్దలుకొట్టి చెప్పేశారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications