Sun Pharma: సన్ ఫార్మాకు ఎదురుదెబ్బ.. హెచ్చరిక లేఖ పంపిన US FDA.. స్టాక్ పరిస్థితి..

Sun Pharma: దేశంలోని అగ్రగామి ఫార్మా కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది సన్ ఫార్మా. దేశీయ అవసరాలను తీర్చుతూ విదేశాలకు సైతం కీలక మందులను ఎగుమతి చేస్తోంది. అయితే ఈ క్రమంలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కంపెనీకి వార్నింగ్ లెటర్ పంపింది.

గుజరాత్ ప్లాంట్..

గుజరాత్ ప్లాంట్..

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ .. సన్ ఫార్మాకు చెందిన గుజరాత్‌ హలోల్ ఫెసిలిటీలో తయారీ యూనిట్లో ఉల్లంఘనలను ఎత్తి చూపుతూ కంపెనీకి హెచ్చరిక లేఖను జారీ చేసింది. ఉత్పత్తుల బ్యాచ్‌ల్లో వ్యత్యాసాలను పరిశీలించడంలో వైఫల్యం, ఔషధాల తయారీలో శుభ్రపరచని పరికరాలను ఉపయోగించడం, కాలుష్యాన్ని నిరోధించడంలో విఫలమవడం వంటి కీలక ఉల్లంఘనలను ఎత్తిచూపింది.

డిసెంబర్ 15న..

డిసెంబర్ 15న..

గుజరాత్ ప్లాంట్‌లో గుర్తించిన వరుస వైఫల్యాలను ఎఫ్డీఏ తన లేఖలో హైలైట్ చేసింది. కంపెనీ హాలోల్ ఫెసిలిటీలో పూర్తయిన ఔషధాల కోసం కరెంట్ గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (CGMP) నిబంధనలలో ముఖ్యమైన ఉల్లంఘనలను FDA ఎత్తి చూపింది. "తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, హోల్డింగ్ కోసం కంపెనీ పాటిస్తున్న.. పద్ధతులు, సౌకర్యాలు లేదా నియంత్రణలు CGMPకి అనుగుణంగా లేనందున ఉత్పత్తులు కల్తీ చేయబడ్డాయని" సన్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ షాంఘ్వీకి రాసిన లేఖలో పేర్కొంది.

నవంబర్ 2021లో..

నవంబర్ 2021లో..

నవంబర్ 2021లో తీవ్రమైన లోపాలను రెగ్యులేటరీ గుర్తించినట్లు తెలుస్తోంది. వివిధ బ్యాచ్ లలో తయారైన మందులను రీకాల్ చేయటానికి కంపెనీ ఐదు నెలలు వేచి ఉండటాన్ని తప్పుపట్టారు. దీని వల్ల రోగులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు.

కాలుష్యంపై సీరియస్..

కాలుష్యంపై సీరియస్..

హలోల్ తయారీ యూనిట్లో కాలుష్యాన్ని నిరోధించడానికి సన్ ఫార్మా తగిన విధానాలను అనుసరించలేదని FDA తన లేఖలో ఎత్తి చూపింది. పర్యావరణ పరిస్థితులను పర్యవేక్షించేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా మేజర్ విఫలమైందని అందులో వెల్లడించింది. ఔషధ ఉత్పత్తుల తయారీలో తగిన పరికరాలను ఉపయోగించడంలో సన్ ఫార్మా విఫలమైందని అమెరికా సంస్థ గుర్తించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కొంత గడువు కూడా ఇచ్చింది.

స్టాక్ పరిస్థితి..

స్టాక్ పరిస్థితి..

ఈ వార్తల నేపథ్యంలో ఫార్మా స్టాక్ ఉదయం నుంచి కొంత ఒడిదొడుకుల్లో ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది. ఈ ఉదయం స్టాక్ రూ1,012 వద్ద ట్రేడింగ్ ప్రారంభించగా.. ప్రస్తుతం 9.43 గంటల సమయంలో 1,013.25 వద్ద ట్రేడ్ అవుతోంది. దీనికి తోడు మిగిలిన ఫార్మా స్టాక్స్ కూడా ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+