For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crypto Scam: అందాల కిలాడీ లేడీ క్రిప్టో మోసం.. 'వన్ కాయిన్' అంటూ ఊడ్చేసింది.. పట్టిస్తే భారీ బహుమతి..

|

Cryptoqueen Scam: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ స్కామ్ చేసి అదృశ్యమైన ఆ అందమైన మహిళ మీకు గుర్తుందా? అవును.. 'వన్ కాయిన్ క్రిప్టోకరెన్సీ ఫ్రాడ్' ద్వారా 2017లో దాదాపు 4 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం.. 35 వేల కోట్ల రూపాయల మోసం చేసిన రూజా ఇగ్నాటోవా అనే మహిళ మాయమైపోయింది. ఇప్పుడు US ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ FBI తన టాప్-10 మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల జాబితాలో రుజా ఇగ్నాటోవాను చేర్చింది. రుజా గురించి ఎవరైనా సమాచారాన్ని ఇస్తే.. వారికి లక్ష డాలర్లు బహుమతిగా అందిస్తామని అమెరికా ప్రకటించింది. FBI 72 ఏళ్ల చరిత్రలో టాప్-10 జాబితాలో ఉన్న 11వ మహిళగా రుజా ఇగ్నాటోవా నిలిచింది. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద క్రిప్టోకరెన్సీ మోసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మహిళ మదిలో 'వన్ కాయిన్' మోసం..

మహిళ మదిలో 'వన్ కాయిన్' మోసం..

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో మోసాన్ని బల్గేరియా నివాసి రుజా ఇగ్నాటోవా అనే మహిళ చేసింది. క్రిప్టోకరెన్సీ పేరుతో రుజా అతిపెద్ద మోసానికి పాల్పడింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న రుజా పీహెచ్‌డీ చేసింది. తన తెలివితేటలను సదరు మహిళ తప్పు ప్రయోజనం కోసం ఉపయోగించింది. ఇందుకోసం యూకేలో సొంతంగా కంపెనీని స్థాపించి 2014లో వన్ కాయిన్ పేరుతో క్రిప్టోకరెన్సీని తీసుకొచ్చింది.

బిట్‌కాయిన్ కంటే పెద్ద క్రిప్టోకరెన్సీ అంటూ ప్రచారం చేసి..

బిట్‌కాయిన్ కంటే పెద్ద క్రిప్టోకరెన్సీ అంటూ ప్రచారం చేసి..

ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి రుజా OneCoin చాలా సురక్షితమైన క్రిప్టోకరెన్సీ అంటూ భారీ స్థాయిలో ప్రచారం చేసింది. దీని కోసం KYC కూడా చేయబడుతుందని, డబ్బు భద్రత కోసం తాను బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగిస్తానని, వన్ కాయిన్‌లో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటున్నట్లు ప్రజలకు చెప్పింది. రానున్న కొన్ని సంవత్సరాల్లో వన్‌కాయిన్.. బిట్‌కాయిన్ కంటే పెద్ద క్రిప్టోకరెన్సీగా మారుతుందని రుజా అప్పట్లో పేర్కొంది.

భారీ ప్రమోషన్లతో నమ్మకం కలిగించి..

భారీ ప్రమోషన్లతో నమ్మకం కలిగించి..

వన్ కాయిన్‌ని ప్రమోట్ చేయడానికి రుజా ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంది. ఆమె వెబ్‌నార్లు చేయడం ప్రారంభించింది. అనేక చోట్ల ఈవెంట్‌లను నిర్వహించడం అంటే వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయడం చేసింది. రాబోయే సంవత్సరాల్లో ప్రజలు బిట్‌కాయిన్‌ను మరచిపోతారని, అతిపెద్ద క్రిప్టోకరెన్సీ వన్ కాయిన్ అంటూ ప్రచార హోరు సాగించింది. ఆమె మల్టీలెవల్ మార్కెటింగ్ కోసం సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్స్ కు OneCoin గురించి వివరించింది. అలా తన మాటలతో వారిని ఆకట్టుకునేది. రుజా ఇదే క్రమంలో ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో తన పెయిడ్ ప్రమోషన్‌ల కోసం వినియోగించింది. దీంతో వన్ కాయిన్‌ని చూడగానే ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందడం ప్రారంభమై.. చాలా పెట్టుబడులు రావడం ప్రారంభించాయి.

అన్నీ అమ్ముకుని పెట్టుబడులు..

అన్నీ అమ్ముకుని పెట్టుబడులు..

OneCoin ప్రజాదరణ ఎంతగా పెరిగిందంటే.. ప్రజలు దాని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా డబ్బును ఇన్వెస్ట్ చేయటం ప్రారంభించారు. భారత్‌తో పాటు చైనా, యూకే, దక్షిణాఫ్రికాకు చెందిన అనేక మంది ఇందులో డబ్బును పెట్టుబడులు వచ్చాయి. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ప్రజలు తమ భూమిని, జంతువులను అమ్ముకుని దానిలో డబ్బు పెట్టుబడి పెట్టారు. కంపెనీలో పనిచేస్తున్న మల్టీలెవల్ మార్కెటింగ్ లీడర్లు కూడా భారీ లాభాలను ఆర్జించేందుకు తమ కమీషన్లను వన్ కాయిన్‌లో పెట్టుబడిగా పెట్టి చివరికి మోసపోయారు.

OneCoinపై కొంత మంది అనుమానం..

OneCoinపై కొంత మంది అనుమానం..

వీటన్నింటి మధ్య కొంతమంది వ్యక్తులు వన్ కాయిన్‌ను అనుమానించేవారు. దాని వాస్తవికతను తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సోషల్ మీడియాలో కూడా వన్ కాయిన్ గురించి ప్రశ్నలు మొదలయ్యాయి. అటువంటి పరిస్థితిలో.. అక్టోబర్ 2017లో పోర్చుగల్‌లో జరిగిన ఒక ఈవెంట్ ద్వారా ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం గురించి రుజా మాట్లాడారు. ఈ ఈవెంట్‌లో ఆమె వన్‌కాయిన్‌ను ఎప్పుడు నగదుగా మార్చవచ్చో కూడా చెబుతానంది. ప్రజలు ఇప్పటికీ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. రుజా ఇగ్నాటోవా సుమారు 5 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 35 వేల కోట్ల రూపాయల క్రిప్టోకరెన్సీ మోసం చేసి తప్పించుకుంది. రుజాతో పాటు ఈ స్కామ్‌లో భాగమైన చాలా మంది ఇప్పటికే అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆమె జాడ తెలియకపోవటంతో పాటు చరిత్రలో ఇది అతిపెద్ద స్కామ్‌లలో ఒకటిగా నిలిచిందని టైమ్స్ వార్తా సంస్థ వ్యాఖ్యానించింది.

OneCoin పూర్తిగా నకిలీ..

OneCoin పూర్తిగా నకిలీ..

OneCoin అనేది వాస్తవానికి క్రిప్టోకరెన్సీ కాదు. అది క్రిప్టోకరెన్సీలా మైనింగ్ చేయబడలేదు. ఇది ఏ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని కూడా ఉపయోగించలేదు. కానీ.. SQL సర్వర్‌ను మాత్రమే ఉపయోగించింది. వన్ కాయిన్ అత్యంత సురక్షితమైనదనే వాదన కూడా తప్పు. ఎందుకంటే ఇది అస్సలు సురక్షితం కాదు. పూర్తిగా బోగస్ ఉత్పత్తి. ఇది ప్రజలను మోసం చేయడం కోసం మాత్రమే రుజా దీనిని తీసుకొచ్చింది. దీనికి తన మార్కెటింగ్ స్కిల్స్ ఉపయోగించి ప్రజలను లూటీ చేసింది.

Read more about: crypto
English summary

us fbi issued lookout notice on cryptoqueen ruja ignatova who looted investors in name of onecoin

know biggest crypto scam of ruja ignatova who promoted onecoin with fake promises
Story first published: Tuesday, July 5, 2022, 13:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X