US Employment Card: ప్రస్తుతం దేశంలోని చాలా మంది యువతకు అమెరికా పోయి డాలర్లు సంపాదించాలని కోరిక. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ డాలర్ల వేట బాట పట్టే యువత సంఖ్య మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువే. ఈ క్రమంలోని వారిని ఉత్సాహపరిచే వార్త ఒకటి వచ్చేసింది.
యూఎస్ పౌరసత్వం & ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా ఒక అప్ డేట్ ప్రకటించింది. ఇది భారతీయులకు ముఖ్యంగా US గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రయోజనం చేకూరుస్తుందని తెలుస్తోంది. కొన్ని నాన్-ఇమ్మిగ్రెంట్ వర్గాలకు (గ్రీన్ కార్డ్‌ల కోసం వేచి ఉన్న వారితో సహా) 5 ఏళ్ల పాటు ఉపాధి అధికార కార్డులను(US Employment Card) అందించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం 10.5 లక్షల మంది భారతీయులు క్యూలో ఉన్నట్లు సమాచారం.

అమెరికా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఉద్యోగ అధికార పత్రాల (EAD) గరిష్ఠ వ్యాలిడిటీ కాలాన్ని 5 ఏళ్లకు పెంచింది. EAD చెల్లుబాటును 5 సంవత్సరాలకు పొడిగించడం ద్వారా.. ఏజెన్సీ కొత్త ఫారమ్‌ల I-765 సంఖ్యను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ సమయాలు, బ్యాక్‌లాగ్‌లను తగ్గించడానికి చేపడుతున్న ప్రయత్నాలకు ఇది దోహదపడింది. అయితే దీనికి మరోపక్క అమెరికాలో త్వరలో రానున్న ఎన్నికల్లో భారతీయ ఓటర్ల మద్ధతును కూడగట్టుకునేందుకు చేసిన ఒక చర్యగా దీనిని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
గ్రీన్ కార్డ్ అంటే ఏంటి..??
ఎవరైనా విదేశీ వ్యక్తి అమెరికాలో స్థిరపడిన తర్వాత అక్కడ అధికారిక పౌరుడిగా నివసించాలంటే తప్పనిసరిగా అమెరికా ప్రభుత్వం నుంచి గ్రీన్ కార్డు పొందాల్సి ఉంటుంది. ఇది అమెరికా అధికారిక పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్. ఈ కార్డును పొందిన విదేశీయులు అమెరికాలో జీవితకాలం పాటు నివసించేందుకు అక్కడి ప్రభుత్వం అధికారికంగా అందించే చట్టపరమైన కార్డు ఇది. అయితే వీటి జారీపై పరిమితులు ఉన్నాయి. అవి వివిధ దేశాలకు వేరువేరుగా ఉంటాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications