ఉద్యోగుల కోతలు ప్రారంభించిన Walt Disney.. వేల మంది టార్గెట్ ఎందుకంటే
Walt Disney Layoffs: గత నెలలో ప్రకటించిన 5.5 బిలియన్ డాలర్ల పొదుపు చర్యల్లో భాగంగా మెుదటి విడత చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలో 7000 మంది ఉద్యోగాల కోతను మెుదలు పెట్టింది. ఈ క్రమంలో ప్రభావితమయ్యే ఉద్యోగులకు.. రానున్న నాలుగు రోజుల్లో తెలియజేయబడుతుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబ్ ఇగర్ సోమవారం సిబ్బందికి ఒక మెమోలో తెలిపారు.
సీఈవో వెల్లడించిన వివరాల ప్రకారం రెండవ అతిపెద్ద రౌండ్ తొలగింపులు ఏప్రిల్ లో జరుగనున్నాయి. ఇది అనేక వేల మంది కార్మికులపై ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తోంది. తొలగింపులకు గురికానున్నా చివరి రౌండ్ ఉద్యోగులకు వేసవిలోపు నోటీసులు అందనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వినోద సంస్థ ఆర్థిక పనితీరును మెరుగుపరిచేందుకు ఇగెర్ భారీ ప్రణాళికను తెరమీదకు తెచ్చారు. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ దాదాపు ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూసింది.

ప్రస్తుతం కంపెనీ తన స్ట్రీమింగ్ టీవీ వ్యాపారంలోని సవాళ్లను అధిగమించి లాభాలను పొందాలని చూస్తోంది. మొదటి రౌండ్ ఉద్యోగాల తగ్గింపులో ఇద్దరు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు కూడా ఉండటం గమనార్హం. వారు హులు, ఫ్రీఫార్మ్ నెట్‌వర్క్‌లో ఉత్పత్తికి నాయకత్వం వహించారు. కంపెనీ తన థీమ్ పార్కులు మరియు ESPN స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లతో సహా కంపెనీలోని అన్ని భాగాల్లో కోతలకు వెళ్లవచ్చని భావిస్తున్నారు. దీనికి ముందు అక్టోబర్ 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2,20,000 మందిని డిస్నీ నియమించుకుంది.
వాల్ట్ డిస్నీ CEO అయిన బాబ్ ఇగెర్, TV వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్న డానా వాల్డెన్, ఫిల్మ్ స్టూడియోలను నడుపుతున్న అలాన్ బెర్గ్‌మాన్ వంటి సృజనాత్మక నాయకులకు మరింత శక్తిని అందించడంతోపాటు, కంపెనీ ఆర్థిక పనితీరును మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందించారు. కంపెనీ టీవీ, సినిమా వ్యాపారాల్లో డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిక్యూటివ్‌లను కలిగి ఉండే పాత విధానాన్ని కూడా కంపెనీ తొలగిస్తోంది.


Click it and Unblock the Notifications