For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1946 కంటే వేగంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం, కోట్ల ఉద్యోగాల కోత

|

కరోనా మహమ్మారి ప్రజలను బలి తీసుకోవడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ వైరస్ అమెరికాలో ఇప్పటి వరకు 7,402 మందిని బలి తీసుకుంది. దాదాపు మూడు లక్షల మంది బాధితులు ఉన్నారు. దీంతో పాటు అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలుతోంది. దాదాపు గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంతగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందట. ఈ మేరకు మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది.

సూపర్: Forbes 30 అండర్ 30 లిస్ట్‌లో 5గురు హైదరాబాదీలు, కేటీఆర్ అభినందనసూపర్: Forbes 30 అండర్ 30 లిస్ట్‌లో 5గురు హైదరాబాదీలు, కేటీఆర్ అభినందన

1946 కంటే దారుణం..

1946 కంటే దారుణం..

అమెరికా ఆర్థిక వ్యవస్థ 1946లో కంటే చాలా దారుణంగా కుంచించుకు పోతోందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 2020లో అమెరికా ఎకానమీ 5.5 శాతానికి తగ్గుతుందని తెలిపింది. 1946 తర్వాత ఇదే మొదటిసారి. రెండో క్వార్టర్‌లో 38 శాతం మేర నష్టపోతుందని శుక్రవారం నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్, దీని కారణంగా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై అంచనా వేసింది.

కుంచించుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ

కుంచించుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ

యూఎస్ బ్యాంకు మొదటి క్వార్టర్‌లో ఆర్థిక వ్యవస్థ కుదింపును 2.4 శాతం నుండి 3.4 శాతానికి పెంచింది. రెండో క్వార్టర్‌లో అదే ఆర్థిక వ్యవస్థ గతంలో 30 శాతం కుంచించుకుపోతుందని పేర్కొనగా, ఇప్పుడు దానిని 38 శాతానికి పెంచింది.

భారీ ఉద్యోగాల కోత

భారీ ఉద్యోగాల కోత

అమెరికా నిరుద్యోగం రెండో త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో 15.7 శాతం ఉంటుందని ఆర్థికవేత్తల అంచనా. ఇంతకుముందు దీనిని 12.5 శాతంగా అంచనా వేశారు. రెండో త్రైమాసికంలో 21 మిలియన్ల ఉద్యోగాల కోత ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్థిక సంక్షోభం..

ఆర్థిక సంక్షోభం..

ఆర్థిక సంక్షోభం తీవ్రతరం కావడంతో రెండో త్రైమాసికంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి 7 శాతం కంటే తగ్గుతుందని అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం విడుదల చేసిన అంచనాలు వెల్లడించాయి.

English summary

1946 కంటే వేగంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం, కోట్ల ఉద్యోగాల కోత | US economy to shrink at fastest rate since 1946, unemployment rise

The United States economy will shrink 5.5 percent in 2020, the steepest drop since 1946, with a huge 38 percent contraction predicted for the second quarter, Morgan Stanley said on Friday in a new batch of forecasts on the economic damage from the coronavirus outbreak.
Story first published: Saturday, April 4, 2020, 9:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X