అమెరికన్ టెక్ కంపెనీలు H1B వీసాను ఉపయోగించి ప్రతిభావంతులైన విదేశీయులను అమెరికాకు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తాయి. ఈ విధంగా, H1B వీసాపై అమెరికాకు వెళ్లే వారిలో 70% మంది భారతీయ టెక్ నిపుణులే. అయితే దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అమెరికా మాజీ కాంగ్రెస్ సభ్యుడు, ప్రసిద్ధ ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ H-1B వీసా వ్యవస్థలో భారీ స్థాయి అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయంటూ భారతదేశాన్ని తీవ్రంగా విమర్శించారు.
అమెరికాలో ప్రతి ఏడాది H-1B వీసాలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి 85 వేలు మాత్రమే. కానీ ఆయన ఆరోపణల ప్రకారం భారతదేశంలోని ఒకే జిల్లా మద్రాస్ (చెన్నై ప్రాంతం) 220,000 H-1B వీసాలు పొందింది, అంటే US క్యాప్‌కి 2.5 రెట్లు ఎక్కువ అని విమర్శలు గుప్పించారు.ఇది సూటిగా మోసం కాకపోతే ఇంకేమిటని ఆయన ప్రశ్నించారు.అమెరికా ప్రభుత్వ డేటా ప్రకారం..ప్రస్తుతం H-1B వీసాదారులలో 70 శాతం కంటే ఎక్కువ మంది భారతదేశం నుండి వస్తున్నారు. తరువాతి స్థానంలో చైనా 10 నుండి 12 శాతంతో ఉందని ఆయన తెలిపారు. ఇది అసమాన పంపిణీని చూపుతుందని, వ్యవస్థను కొందరు ఉద్దేశపూర్వకంగా అక్రమాల బాట పట్టిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

డోనాల్డ్ ట్రంప్ 2024లో మళ్ళీ వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అమెరికా ముందు విధానం భాగంగా H-1B వీసాలపై కఠిన చర్యలు చేపట్టారు. వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల భారీ ఫీజు విధించారు. అమెరికా ఉద్యోగాలను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని ట్రంప్ ప్రకటించినప్పటికీ..ఈ చర్య దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలకు కారణమైంది.
స్టీవ్ బానన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన డాక్టర్ బ్రాట్ H-1B వింటే మీ కుటుంబాన్ని ఆలోచించండి. ఎందుకంటే ఈ మోసపూరిత వీసాలు మీ పిల్లల భవిష్యత్తును దోచేస్తున్నాయి. వీరి నైపుణ్యాలు మాయ. అసలు సామర్థ్యం లేని వారిని తీసుకొచ్చి, అమెరికన్ ఉద్యోగాలు, ఇళ్లు, అవకాశాలు దోచేస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు.ఇదే విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొన్న నివేదిక ప్రకారం.. 2024లో చెన్నై U.S. కాన్సులేట్ 220,000 H-1B వీసాలు అలాగే 140,000 H-4 డిపెండెంట్ వీసాలు ప్రాసెస్ చేసింది. ఇది ఒకే ప్రాంతంలో వీసాల సంఖ్య అపారంగా పెరిగిందని సూచిస్తుందని తెలిపారు.
అంతకుముందు, అమెరికా మాజీ దౌత్యవేత్త మహవాష్ సిద్ధిఖీ కూడా ఇదే అంశంపై విమర్శలు గుప్పించారు. 2005-07లో చెన్నై కాన్సులేట్‌లో పనిచేసిన ఆమె భారతదేశం నుండి వచ్చే H-1B వీసాలలో 80 నుండి 90 శాతం మోసపూరితమైనవేనని అన్నారు.నకిలీ డిగ్రీలు, ఫేక్ డాక్యుమెంట్లు, అసలు నైపుణ్యం లేకపోయినా సర్టిఫికేషన్లు చూపించి వీసాలు పొందుతున్నారని ఆమె తెలిపారు. చాలా సందర్భాలలో ప్రాక్సీ అభ్యర్థులు ఇంటర్వ్యూల్లో హాజరయ్యారని, ఈ వ్యవస్థలో లంచం, అక్రమాలు మాములయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక భారతీయ-అమెరికన్‌గా చెప్పడం బాధాకరం, కానీ నిజాలు ఇవేనని ఆమె అన్నారు.
H-1B వీసాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. అమెరికాలో ఉద్యోగ నష్టం భయం పెరగడంతో, ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ICE దాడులు, బహిష్కరణలు, H-1B ప్రక్రియ సవరణలు, ఫీజు పెంపు, అంతర్జాతీయ విద్యార్థులపై కొత్త పరిమితులు అమల్లోకి వచ్చాయి.ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమనే విషయంపై ప్రపంచం ఎదురు చూస్తోంది. కానీ ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. H-1B వీసా వ్యవస్థ ఇప్పుడు అంతర్జాతీయ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. అమెరికా ఉద్యోగాలపై, ఇమ్మిగ్రేషన్ విధానంపై దీని ప్రభావం భారీగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications