US Tariffs: అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతదేశం నుండి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై 50 శాతం కొత్త సుంకం విధిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టారిఫ్ ఆగస్టు 27, 2025 అర్ధరాత్రి 12:01 (EST) నుండి అమల్లోకి రానుందని యుఎస్ అధికారిక నోటీసు విడుదల చేసింది. కాగా రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కోకు పరోక్షంగా ఆర్థిక సహాయం అందిస్తున్నదని అమెరికా ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి విదితమే.
ఇప్పటికే ఆగస్టు 1 నుండి 25 శాతం పరస్పర సుంకం అమల్లో ఉంది. దీనికి అదనంగా ఇప్పుడు మరో 25 శాతం కలిపి మొత్తం 50 శాతం సుంకం ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. దీని ఫలితంగా భారతదేశం నుంచి 87 బిలియన్ డాలర్లు (సుమారు 7.3 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులు ప్రభావితమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త టారిఫ్‌ల ప్రభావం వస్త్ర పరిశ్రమ, రత్నాలు, ఆభరణాలు, తోలు, సముద్ర ఉత్పత్తులు, రసాయనాలు, ఆటో విడిభాగాలు వంటి ప్రధాన రంగాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. భారతదేశం ఎగుమతి ద్రవ్యోల్బణం, గ్లోబల్ పోటీ సామర్థ్యానికి ఇది పెద్ద సవాలుగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఔషధాలు, సెమీకండక్టర్లు, ఇంధన వనరులు వంటి కొన్ని కీలక విభాగాలను అమెరికా ఈ టారిఫ్ నుండి మినహాయించింది.

భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అన్యాయమైనదిగా ఖండించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. భారత్ తన ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాల ఆధారంగా రష్యా నుండి చమురును దిగుమతి చేసుకుంటోందని స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరత్వం కోసం ఈ దిశలో చర్యలు తీసుకోవాలని అమెరికాకి ఇప్పటికే సూచించినట్లు గుర్తుచేసింది.
ప్రస్తుతం భారత్ తక్షణ ప్రతీకార సుంకాలను విధించడం కాకుండా.. దౌత్యపరమైన చర్చలు, ఎగుమతిదారులకు ప్రోత్సాహక ప్యాకేజీలు వంటి మార్గాలను పరిశీలిస్తోంది. దీని ద్వారా గ్లోబల్ వాణిజ్య వాతావరణాన్ని కాపాడుకోవడంతో పాటు, ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించే ప్రయత్నం ఢిల్లీ చేస్తోంది.
ఈ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే స్పష్టమైన సందేశం ఇచ్చారు. అహ్మదాబాద్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ ఎంత ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన మార్గంలోనే కొనసాగుతుంది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గుజరాత్ నుండి కొత్త శక్తిని పొందుతోంది. ఇది గత రెండు దశాబ్దాల కృషి ఫలితమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ఎగుమతిదారులకు కాసింత మనోధైర్యాన్నిచ్చాయి.
అమెరికా సుంకాలు పెరగడం వల్ల భారత ఎగుమతులు గణనీయంగా ప్రభావితమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలపై, ఉత్పత్తి ఖర్చులపై, ఎగుమతి ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే గ్లోబల్ వాణిజ్యంలో మందగమనం ఉన్న తరుణంలో ఈ చర్య భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఒత్తిడిని తెచ్చే ప్రమాదం ఉందని నిఫుణులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే నెలలు భారత వాణిజ్య విధానం, ఎగుమతి రంగానికి కీలకంగా మారబోతున్నాయి.
More From GoodReturns

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications