ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఇరాన్‌లో అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వస్తుంటే, మరోవైపు అమెరికా తన అత్యంత శక్తివంతమైన డూమ్స్ డే ప్లేన్ (Doomsday Plane) గాల్లోకి లేపింది. దీన్ని ప్రళయ కాలంలో వాడే విమానంగా చెప్తుంటారు. దీన్ని గాల్లోకి లేపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ విమానం ఎందుకు బయటకు వచ్చింది? ఇరాన్ పరిస్థితులకు దీనికి సంబంధం ఏంటి?

ఇరాన్‌లో నిప్పులు చిమ్ముతున్న నిరసనలు
జనవరి 11, 2026 నాటికి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా 180 నగరాల్లో ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు వారాలుగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 65 మందికి పైగా సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. కరెన్సీ పతనం, ఆర్థిక కష్టాల వల్ల మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు అయతొల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తిరుగుబాటుగా మారాయి. ప్రభుత్వం ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేసినప్పటికీ, ప్రజలు రోడ్లపైకి వచ్చి " ఖమేనీకి మరణం" అంటూ నినాదాలు చేస్తున్నారు.
రంగంలోకి 'డూమ్స్‌డే ప్లేన్' (Doomsday Plane)
ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో అమెరికాకు చెందిన E-4B 'Nightwatch' యుద్ధ విమానాన్ని రంగంలోకి దింపింది. దీన్నే డూమ్స్ డే ప్లేన్ (Doomsday Plane) అంటారు. ఇది గాల్లోకి లేవడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విమానం సాధారణమైనది కాదు. అణు యుద్ధం సంభవించినా లేదా భూమిపై ఉన్న కమాండ్ సెంటర్లు ధ్వంసమైనా.. ఆకాశం నుండే దేశాన్ని, సైన్యాన్ని నడిపించే సత్తా దీనికి ఉంది. ఇటీవలే ఇది వాషింగ్టన్, లాస్ ఏంజిల్స్ ప్రాంతాల్లో కనిపించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇందులో ప్రయాణించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగినప్పుడే ఈ విమానాన్ని సిద్ధం చేస్తారు.
ట్రంప్ హెచ్చరికలు.. సైనిక చర్యకు రంగం సిద్ధమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, అమెరికా వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఇరాన్‌పై వైమానిక దాడులకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రిటైర్డ్ మిలిటరీ కల్నల్ డగ్లస్ మెక్‌గ్రెగర్ వంటి విశ్లేషకులు.. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా సైనిక మోహరింపు పెరుగుతోందని, ఇరాన్‌పై దాడులు ఏ క్షణమైనా జరగవచ్చని అంచనా వేస్తున్నారు.
నిరసనకారులకు మద్దతుగా మాజీ యువరాజు
ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లావి కూడా ఈ నిరసనలకు మద్దతు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నగరాలను స్వాధీనం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం మరింత రెట్టింపయింది. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఈ గొడవల వెనుక అమెరికా, ట్రంప్ హస్తం ఉందని ఆరోపిస్తోంది. నిరసనకారులకు 'మరణశిక్ష' విధిస్తామని కూడా హెచ్చరిస్తోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే అమెరికా తన డూమ్స్ డే ప్లేన్ (Doomsday Plane) ను అప్రమత్తం చేయడం అనేది ఇరాన్ లేదా వెనిజులా వంటి దేశాల విషయంలో ఒక బలమైన హెచ్చరికగా కనిపిస్తోంది. మరి ఈ ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ట్రంప్ కీలక ప్రకటన..చమురును అమెరికా నుండే కొనుగోలు చేయాలని ఆదేశాలు..

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

ఇరాన్ కథను వచ్చే వారంలో ముగిస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన.. బెదిరింపులపై ఇరాన్ ఏమందంటే..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్ కుదేల్.. ఆస్తులు కాపాడుకోవడానికి పెట్టుబడిదారులకు కీలక సూచనలు ఇవిగో..

Strait of Hormuz: సముద్రం మధ్యలో టోల్ గేట్! ప్రపంచానికి ఇరాన్ షాక్!

అమెరికాకు దిమ్మతిరిగి షాక్..హార్ముజ్ జలసంధిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications