Top currencies: ప్రపంచ వాణిజ్యానికి కరెన్సీ జీవనాధారం కాగా ఆయా దేశాల ఆర్థిక శక్తికి ప్రతిబింబంగా నిలుస్తుంది. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి కరెన్సీ బలాన్ని ప్రామాణికంగా భావిస్తుంటారు. అయితే కరెన్సీ బలం అనేది సరఫరా మరియు డిమాండ్‌తో పాటు వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం, భౌగోళిక మరియు రాజకీయ స్థిరత్వం ఆధారంగా నిర్ణయించబడుతుంది.
ఐక్యరాజ్యసమితి 180 కరెన్సీలను చట్టబద్ధమైన టెండర్‌గా అధికారికంగా గుర్తించింది. ప్రపంచంలోని 10 బలమైన కరెన్సీల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఇందులో కువైట్ దినార్ మొదటి స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. రూపాయితో పోలిస్తే ఒక దినార్ విలువ 270.23 మరియు 3.25 డాలర్లకి సమానం . తదనంతర స్థానాన్ని బహ్రెయిన్ దినార్ సొంతం చేసుకుంది. దీని విలువ 220.4 రూపాయలు కాగా 2.65 డాలర్లుగా ఉంది.

బ్రిటిష్ పౌండ్ రూ. 105.54 (1.27 డాలర్లు) విలువతో ఆరో స్థానానికి పరిమితమైంది. ఇక స్విస్ ఫ్రాంక్, యూరోలు వరుసగా ఎనిమిది మరియు తొమ్మిదవ స్థానాన్ని ఆక్రమించాయి. అయితే ఆసక్తికరంగా US డాలర్ మాత్రం ఈ టాప్ 10 జాబితాలో చివరి స్థానంలో ఉంది. అత్యంత విస్తృతంగా వర్తకం చేయబడుతున్న కరెన్సీ అయినప్పటికీ, ప్రపంచంలోని బలమైన కరెన్సీలలో మాత్రం వెనకబడి ఉండటం గమనార్హం.
ఇక భారత్ విషయానికి వస్తే.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) వెబ్‌సైట్‌లోని మారకపు రేటు ప్రకారం రూపాయి 15వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 1960లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలకడగా ర్యాంక్ పొందుతోంది. స్విట్జర్లాండ్, లిచెన్‌స్టెయిన్ కరెన్సీ స్విస్ ఫ్రాంక్ అత్యంత స్థిరమైన కరెన్సీగా పరిగణించబడుతున్నట్లు ఫోర్బ్స్ తెలిపింది.


Click it and Unblock the Notifications