బెంగళూరులో ఫ్లాట్ కొనే పైసలతో అమెరికా డిగ్రీ చేయొచ్చు! ఈ షాకింగ్ లెక్కలు చూశారా?

భారతదేశంలో ప్రతీ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రుల పెద్ద కల ఏంటంటే.. తమ పిల్లలను పైచదువుల కోసం విదేశాలకు పంపించడం. అదొక ఎమోషనల్ సెంటిమెంట్‌గా మారిపోయింది. కానీ, ప్రస్తుతం విదేశీ చదువుల ఖర్చు వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ రోజుల్లో ఒక పిల్లాడిని వెస్ట్రన్ కంట్రీస్‌కి పంపించి చదివించాలంటే దాదాపు 2.5 కోట్ల రూపాయలు ($250,000) ఖర్చవుతోంది. ఈ డబ్బుతో ఐటీ హబ్ అయిన బెంగళూరు (Bengaluru) లేదా హైదరాబాద్ వంటి మెట్రో సిటీస్‌లో ఒక లగ్జరీ 2BHK లేదా 3BHK ఫ్లాట్ కొనేయొచ్చు! అయినా సరే, దాదాపు 90 శాతం మంది పేరెంట్స్ తమ పిల్లలను అబ్రాడ్ పంపించడానికే మొగ్గు చూపుతున్నారని హెచ్‌ఎస్‌బీసీ (HSBC) సర్వే చెప్తోంది.

US Degree Costs More Than Bengaluru Flat Foreign Education Financial Planning For Parents

రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాళీ.. ఎడ్యుకేషన్ లోన్ల గుదిబండ!

ఇంత భారీ మొత్తాన్ని మధ్యతరగతి తల్లిదండ్రులు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇక్కడే అసలు సమస్య వస్తోంది. చాలా మంది పేరెంట్స్ తమ ముసలి వయసు కోసం దాచుకున్న రిటైర్మెంట్ ఫండ్స్ నుండి 50 నుంచి 60 శాతం డబ్బును పిల్లల చదువుల కోసం వాడేస్తున్నారు. మరికొందరు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFC) చుట్టూ తిరుగుతూ 12-14% భారీ వడ్డీ రేట్లకు ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుంటున్నారు. ఒక పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం.. 2014లో మన దేశంలో రూ. 52,000 కోట్లుగా ఉన్న ఎడ్యుకేషన్ లోన్లు, ఇప్పుడు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్లకు పెరిగిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విదేశీ చదువులు ఇంత ఖరీదుగా ఎందుకు మారాయి?

దీనికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి..

  • రూపాయి విలువ పడిపోవడం: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ప్రతి 12 ఏళ్లకు సగానికి పడిపోతోంది. 1991 నుండి చూస్తే రూపాయి విలువ ఏకంగా 73% క్షీణించింది. అంటే, అప్పట్లో రూ. 26 లక్షలు ఉన్న కోర్సు ఫీజు, కేవలం కరెన్సీ విలువ తగ్గడం వల్లే ఈరోజు రూ. 1 కోటికి చేరింది.
  • యూనివర్సిటీ ఫీజుల పెరుగుదల: అమెరికా, యూకే లాంటి దేశాల్లోని యూనివర్సిటీలు ప్రతి ఏటా దాదాపు 4% ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి.

ఈ కరెన్సీ పతనం, ఫీజుల పెరుగుదల రెండూ కలిసి విదేశీ చదువుల ఖర్చును గత పాతికేళ్లలో 8 రెట్లు పెంచేసాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. 2036 నాటికి, అంటే మరో పదేళ్లలో ఇప్పుడు రూ. 2.5 కోట్లు ఉన్న కోర్సు ఖర్చు కాస్తా రూ. 5 కోట్లకు చేరుకుంటుంది!

అప్పుల పాలు కాకుండా పిల్లల భవిష్యత్తును ఎలా ప్లాన్ చేయాలి?

పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు తెలివిగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలని మార్కెట్ నిపుణులు సలహా ఇస్తున్నారు. గత 10, 20, 30 ఏళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తే.. అమెరికా స్టాక్ మార్కెట్‌కి చెందిన 'S&P 500' ఇండెక్స్ వార్షికంగా 10% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది.

ఉదాహరణకు, పిల్లాడు ప్రైమరీ స్కూల్‌లోకి అడుగుపెట్టినప్పుడే పేరెంట్స్ ఒక రూ. 50 లక్షలను ఈ S&P 500 ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. ఆ పిల్లాడికి 18 ఏళ్లు వచ్చేసరికి కాంపౌండింగ్ పవర్‌తో ఆ డబ్బు కాస్తా $200,000 (సుమారు రూ. 2 కోట్లు) వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల విదేశీ చదువుల భారం చాలా వరకు తగ్గిపోతుంది. మిగతా మొత్తాన్ని నెలవారీ ఎస్‌ఐపీలు (SIPs), తక్కువ వడ్డీకి వచ్చే ఎడ్యుకేషన్ లోన్ల ద్వారా సులభంగా మేనేజ్ చేయవచ్చు. కాబట్టి, మునిగిపోయే దాకా వెళ్లకుండా బెంగళూరు (Bengaluru) లో ఇల్లు కొనాలన్నా, పిల్లలను అమెరికా పంపాలన్నా ఇప్పటి నుండే పక్కా ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+