US Debt Crisis: అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చరిత్రలో ఎప్పుడూ చూడని స్థాయిలో అప్పుల భారంతో విలవిలలాడుతోంది. దేశ రుణం 35-36 ట్రిలియన్ డాలర్లు దాటింది. అమెరికాలో పెరుగుతున్న రుణ సమస్య అంతర్జాతీయంగా రోజు రోజుకు తీవ్రమైన ఆందోళనకు కారణమవుతోంది. దేశం ఒక ఏడాది ఉత్పత్తి చేసే వస్తువులు, సేవల విలువకంటే ఎక్కువైపోయాయి. ఈ పరిస్థితిని అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ సీరియస్ గా విశ్లేషిస్తూ.. చైనా అమెరికా ట్రెజరీలలోని తన పెట్టుబడులను తగ్గించడం ఒక వివేకవంతమైన చర్య అని పేర్కొన్నారు. అమెరికన్ ట్రెజరీలలో మూడవ అతిపెద్ద పెట్టుబడిదారైన చైనా తన వద్ద ఉన్న బాండ్లను వేగంగా అమ్మడం ప్రారంభించింది.
US ట్రెజరీ అంటే ఏమిటి? US ట్రెజరీ అనేది అమెరికా ప్రభుత్వం జారీ చేసే ఒక రకమైన బాండ్ లేదా రుణ పత్రం. ఒక దేశం లేదా పెట్టుబడిదారుడు వీటిని కొనుగోలు చేస్తే, అది అమెరికా ప్రభుత్వానికి డబ్బు అప్పు ఇవ్వడమే. ప్రతిగా ప్రభుత్వం వడ్డీతో పాటు ప్రధాన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. వోల్ఫ్ అభిప్రాయం ప్రకారం.. అమెరికా ఎప్పుడూ చూడని స్థాయిలో అప్పులు చేసుకుంటోంది. ఒక దేశం తరచుగా అప్పులు పెంచుకుంటే, ఎప్పుడో ఒక రోజు రుణదాతలు "మీరు ఎక్కువగా అప్పు తీసుకుంటున్నారు" అని హెచ్చరిస్తారు. అమెరికా ఇప్పుడు అదే పరిస్థితికి చేరుకుంది. చైనా కూడా అమెరికా తన అప్పులు చెల్లించలేని స్థితికి చేరుకుంటే..మొదట చైనాకు నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేసి రక్షణాత్మకంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

అమెరికా క్రెడిట్ రేటింగ్ పడిపోవడం: ఇది చైనాకు మాత్రమే ఆందోళనకరం కాదు. అమెరికాకు చెందిన మూడు ప్రధాన క్రెడిట్ రేటింగ్ సంస్థలు - స్టాండర్డ్ & పూర్స్, మూడీస్, ఫిచ్ - దేశ రేటింగ్‌ను AAA స్థాయి నుండి తగ్గించాయి. ఇది అమెరికా అప్పు తీర్చే సామర్థ్యం బలహీనమైందని సూచిస్తోంది. రాయిటర్స్ ప్రకారం, చైనా తన హోల్డింగ్‌లను 756.3 బిలియన్ డాలర్ల వరకు తగ్గించింది. ఇది 2009 తర్వాత కనిష్ట స్థాయి. 2012-2016 మధ్య 1.3 ట్రిలియన్ డాలర్లకి పైగా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు చాలా తక్కువ. వరుసగా నాలుగు నెలలుగా చైనా ఈ బాండ్లను విక్రయిస్తూనే ఉంది. అమెరికా క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమని వోల్ఫ్ గుర్తు చేశారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం: ఇతర దేశాలు కూడా చైనాను అనుసరిస్తే, అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ సవాళ్లను ఎదుర్కొంటుంది. పన్నుల కంటే ఎక్కువగా ఖర్చు చేయడానికి అమెరికా ఇక అప్పు తీసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడూ ఎదుర్కోని పరిస్థితి. రుణదాతలు అమెరికాకు డబ్బు ఇవ్వడానికి ఇష్టపడకపోతే, రుణదాతలను ఆకర్షించడానికి వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది. దీని ప్రభావం నేరుగా అమెరికా ప్రజలపై పడుతుంది. కార్ లోన్స్, హౌస్ లోన్స్, ఇతర వినియోగదారుల అప్పులపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. మనం దానిని తట్టుకోలేము. ఇది ఆర్థిక వ్యవస్థను కూలగొడుతుందని వోల్ఫ్ హెచ్చరించారు.
ఇక ప్రభుత్వం డబ్బు దొరకకపోతే, సామాజిక భద్రత, పింఛన్ వంటి కీలక కార్యక్రమాల్లో కోతలు తప్పవని ఆయన అంచనా వేశారు. వృద్ధులు, మధ్యతరగతి, సాధారణ అమెరికన్లు నష్టపోతారని ఆయన అన్నారు. మీకు భద్రత ఉందని అనుకున్నారు, కానీ వాస్తవానికి లేదనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.క్లుప్తంగా రిచర్డ్ వోల్ఫ్ ఏమంటున్నారంటే.. అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఉన్న శక్తివంతమైన స్థితి ఇక లేదు. అమెరికా అప్పులు అధికమవుతున్న కొద్దీ, ప్రపంచ రుణదాతలు అప్పు ఇవ్వడానికి ముందుకు రారని చెబుతున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ చైనా కీలక నిర్ణయం..ఆసియా దేశాలకు భారీ ఊరట..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications