కాయిన్‌బేస్ గుడ్‌న్యూస్, రిమోట్ వర్కింగ్ కోసం ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉద్యోగాలు
భారత్‌లో తమ ఉనికికి కోసం అమెరికా క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ 'కాయిన్‌బేస్' ఇక్కడ నియామక ప్రక్రియను చేపడుతోంది. దేశంలో కార్యకలాపాలు ప్రారంభిస్తానని కాయిన్‌బేస్ ఇటీవల ప్రకటించింది. మరోవైపు క్రిప్టోకరెన్సీ పైన, నిబంధనల పైన మన దేశంలో ఆందోళనలు ఉన్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో కాయిన్‌బేస్ ఇక్కడ నియామకాలు చేపడుతోంది. బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు ఇటీవల భారీగా జంప్ చేసిన విషయం తెలిసిందే. బిట్ కాయిన్ ఏకంగా 61వేల డాలర్లను క్రాస్ చేసింది. తాజాగా స్వల్పంగా క్షీణించి 58వేల డాలర్లకు సమీపంలో ఉంది. క్రిప్టోకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో కాయిన్‌బేస్ కార్యకలాపాలకు సిద్ధమైంది.

నియామకాలు
భారతదేశంలో ఇంజినీరింగ్, సాఫ్టువేర్ డెవలప్‌మెంట్, కస్టమర్ సపోర్ట్ ఆపరేషన్స్‌తో పాటు పలు ఐటీ సేవల కోసం నియామకాలు చేపడుతున్నామని, ప్రపంచస్థాయి ఇంజినీరింగ్ ప్రతిభావంతులకు ఇక్కడ కొదువలేదని, దీని ద్వారా తాము ప్రయోజనం పొందుతున్నామని కాయిన్‌బేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంజినీరింగ్, టెక్నాలజీ వినూత్న ఆవిష్కరణలకు భారత్ పెట్టింది పేరు అని, ఇక్కడ వరల్డ్ క్లాస్ టాలెంట్ కోసం తాము ఎదురు చూస్తున్నామన్నారు.

రిమోట్ వర్కింగ్
ప్రతిభావంతులకు వివిధ ప్రాంతాల్లో పని చేసే అవకాశాలు ఉంటాయని నియామకాలను ఉద్దేశించి కాయిన్‌బేస్ తెలిపింది. ప్రస్తుతం నియామకాల్ని రిమోట్ వర్కింగ్ కోసం తీసుకుంటున్నట్లు పేర్కొంది. కాయిన్‌బేస్ వెబ్ సైట్ కెరీర్ పేజీ ప్రకారం ఇండియాలో ఈ కంపెనీ ఇంజినీరింగ్, ప్రోడక్ట్ సంబంధిత విభాగాల్లో పలు రిమోట్ జాబ్ పోస్టింగ్స్ ఉన్నాయి.

ఈ దేశాల్లో నియామకాలు
రిమోట్ వర్కింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చిన కంపెనీల్లో కాయిన్‌బేస్ ముందు నిలిచింది. ఈ కంపెనీ భారత్‌తో పాటు కెనడా, తదితర ప్రాంతాల్లో నియామకాలు చేపట్టింది. ఈ అమెరికా అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజీ కెనడాలో మొదట ఆపరేషన్స్ ప్రారంభించింది. కెనడాలో టెక్నాలజీ, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ నియామకం ప్రారంభించింది. అమెరికా, యూకే, ఐర్లాండ్, జపాన్, సింగపూర్, కెనడా, పిలిప్పైన్స్‌తో పాటు ఇప్పుడు భారత్‌లో నియామకాలు చేపట్టనుంది.


Click it and Unblock the Notifications