అమెరికా కోర్టులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు ఊరట లభించింది. ఎపిక్ సిస్టమ్స్‌తో మేధో సంపత్తి హక్కుల విషయంలో టీసీఎస్ పైన విధించిన అపరాధ రుసుము 280 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2100 కోట్లు) రాజ్యాంగపరంగా అధికమేనని అమెరికా కోర్టు ఆఫ్ అప్పీల్ అభిప్రాయపడింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. పరిహార రుసుము 140 మిలియన్ డాలర్లను (1,049 కోట్లు) కట్టాలని తీర్పు చెప్పినట్లు అందులో పేర్కొంది.

టీసీఎస్ అప్పీల్‌కు వెళ్లడంతో..
ఏప్రిల్ 16, 2016లో అమెరికా కోర్టులో మేధో సంపత్తి హక్కుల కేసుకు సంబంధించి టీసీఎస్‌కు 940 మిలియన్ డాలర్ల అపరాధ రుసుము విధించింది. ఆ మరుసటి సంవత్సరం దీనిని 420 మిలియన్ డాలర్లకు తగ్గించింది. దీనిపై టీసీఎస్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్‌కు వెళ్లింది. దీంతో తాజా తీర్పు వచ్చింది.

ఏం జరిగిందంటే
టాటా గ్రూప్‌లోని దేశీయ ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)అమెరికా అనుబంధ సంస్థ టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ సంస్థలపై విస్కాన్సిన్‌లోని అమెరికా ఫెడరల్ కోర్టు నాలుగేళ్ల క్రితం 940 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎపిక్ సిస్టమ్స్ తాలూకు సాఫ్ట్‌వేర్ కేసులో విస్కాన్సిస్ లోని యూఎస్ ఫెడరల్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ముంబైలోని టీసీఎస్, తన అమెరికా అనుబంధ కంపెనీ 'టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్' సంస్థలు కలిసి ఎపిక్ సిస్టమ్స్‌కు 240 మిలియన్ డాలర్లను చెల్లించాలని ఆదేశించింది. అలాగే నష్టపూర్వక జరిమానా కింద మరో 700 మిలియన్ డాలర్లు కూడా కట్టాలని స్పష్టంచేసింది. దీనిపై టీసీఎస్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీలే చేసింది.

ఆ డాక్యుమెంట్స్‌తో ఏ ప్రయోజనమూ పొందలేదు
తమ అనుమతి లేకుండానే తమ సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్ ఉద్యోగులు ఉపయోగించారని, టీసీఎస్ కంపెనీ ఈ సాఫ్ట్‌వేర్‌ను తన హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ మెడ్ మంత్ర ప్రొడక్ట్ అభివృద్ధికి కూడా వినియోగించుకుందని ఎపిక్ సిస్టమ్స్ నాడు ఆరోపించింది. ఒక టీసీఎస్ ఉద్యోగి తమకు సంబంధించిన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేశాడని కూడా నాలుగేళ్ల క్రితం పేర్కొంది. దీనిపై న్యాయస్థానం విచారించింది. అయితే ఆ డాక్యుమెంట్స్ వల్ల తాము ఎలాంటి ప్రయోజనం పొందలేదని పేర్కొంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications