High Salary Job: సాధారణంగా కొంతమంది మా ఆఫీసు తమకు కుటుంబంతో సమానమని చెబుతుంటారు. అయితే ఎంతమంది విషయంలో ఇలాంటి అవకాశం ఉంటుందో తెలియని విషయమే. ఎందుకంటే నచ్చిన ఉద్యోగం, జీతం, మంచి వసతులు కల్పించే సిబ్బంది ఉంటే నిజంగా స్వర్గమే. ఎక్కువ సమయం ఆఫీసులో గడుపుతారు కాబట్టి.. తమ అంచనాలకు అనుగుణంగా ఉండే కంపెనీలను వదిలేందుకు ఉద్యోగులు ఇష్టపడరు. అలాంటి చాలా మంది ఉద్యోగులు అమెరికాలోని ఈ కంపెనీలో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

సూపర్ శాలరీ..
ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోలిస్తే జీతం ఎక్కువగా ఉంటే ఎవరు కాదంటారు. అమెరికన్ కంపెనీ అయిన గ్రావిటీ సంస్థ.. తన ఉద్యోగులకు కనీస వార్షిక వేతనం 80,000 డాలర్లుగా ప్రకటించింది. మన భారత కరెన్సీ ప్రకారం ఇది రూ.63 లక్షలు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఉద్యోగం పొందేందుకు ఎక్కువ మంది దరఖాస్తు చేస్తున్నారు.

బోలెడన్ని ఆఫర్లు..
సీటెల్ ఆధారిత గ్రావిటీ చెల్లింపుల కంపెనీ CEO డాన్ ప్రైస్ తన ఉద్యోగులకు కనీస వేతనాన్ని రూ.63 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో బంపర్ ఆఫర్ ఏమిటంటే ఉద్యోగులు ఎక్కడినుంచైనా పనిచేయవచ్చు. దీనికి తోడు వేతనంతో కూడిన పేరెంటల్ లీవ్‌తో సహా పలు ఇతర ప్రయోజనాలను కూడా డాన్ ప్రకటించారు.
ఉద్యోగులను గౌరవించాలంటూ..
ఉద్యోగులకు ఎల్లప్పుడూ మెరుగైన జీతాలు, ప్రయోజనాలను అందించాలని డాన్ ఇతర కంపెనీలకు కూడా పిలుపునిచ్చారు. వారికి న్యాయమైన ప్రయోజనాలు కల్పించాలని అన్నారు. ముఖ్యంగా కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులను గౌరవంగా చూడటం అవసరమని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. నరకంలాంటి వాతావరణంలో ఎవరూ పని చేయకూడదని కంపెనీ సీఈవో ప్రైస్ తెలిపారు. ప్రైస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌ను కూడా పోస్ట్ చేశారు.

ఉద్యోగులు ఎందుకు ఆసక్తి చూపుతున్నారు..?
కంపెనీ తన ఉద్యోగుల అవసరాలను తీరుస్తుంది. దీంతో ఉద్యోగులు పనిపై ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో ఉద్యోగానికి 300 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. చాలామంది దీనిని ఉత్తమ ఆఫర్‌గా భావిస్తున్నారు.

ట్వీట్‌పై విమర్శలు.. పొగడ్తలు..
ఈ ట్వీట్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. జీతం ఇలా పంచితేనే కంపెనీ అభివృద్ధి చెందుతుందని కూడా మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. తమ కంపెనీ ఆదాయం మూడు రెట్లు పెరిగిందన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications