IT Firing: 11 శాతం ఉద్యోగుల తొలగింపు.. షాకిచ్చిన టెక్ కంపెనీ.. ప్రపంచవ్యాప్తంగా..
IT Firing: రోజుకో జాబ్ ఆఫర్స్ వార్తలు వింటున్న ఐటీ ఔత్సాహికులు మరో పక్క భారీగా ఉద్యోగుల తొలగింపుల వార్తలు భయటకు రావటంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్సీఎల్ టెక్ వంటి కంపెనీలు తొలగింపుల గురించి ప్రకటనలు చేశాయి. క్లౌడ్ కమ్యునికేషన్స్ సేవలు అందించే టెక్ కంపెనీ ఇదే బాటను ఎంచుకుంది.

అమెరికా కంపెనీ..
యూఎస్ కు చెందిన క్లౌడ్ కమ్యూనికేషన్స్ కంపెనీ ట్విలియో 11 శాతం ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు ఉన్న 7,800 మంది ఉద్యోగుల్లో 850 మందిని కంపెనీ తొలగించింది. కంపెనీ ప్రస్తుతం యూఎస్ తో పాటు ఇతర దేశాల్లో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది.

తొలగింపు తర్వాత..
తొలగించబడిన ఉద్యోగులను క్లౌడ్ కమ్యూనికేషన్స్ కంపెనీ ప్రెసిడెంట్‌తో కలిసేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ట్విలియో సీఈవో జెఫ్ లాసన్ వెల్లడించారు. ప్రస్తుతం వ్యాపార ప్రపంచం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున కంపెనీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

కంపెనీ ప్రకటన..
ఇది కంపెనీ తీసుకునే చివరి దశ తొలగింపులని సీఈవో లాసన్ తెలిపారు. అయితే ఇది తెలివైన, అవసరమైన నిర్ణయమని భావిస్తున్నానని అన్నారు. నిర్ణయానికి తానుబాధ్యత వహిస్తానన్నారు. ఈ నిర్ణయం కష్టమైనప్పటికీ తప్పక తీసుకున్నట్లు తెలిపారు.

పెట్టుబడి..
కంపెనీ చేసిన మెుత్తం పెట్టుబడి వల్ల వస్తున్న రాబడులపై కంపెనీ దృష్టి సారించింది. వాటిలో కొన్ని పెట్టుబడులు అర్థవంతంగా లేవని కంపెనీ గుర్తించింది. వాటిని సమర్థవంతంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనిని సరిదిద్దేందుకు చర్యలకు ఉపక్రమించినందున క్రమంలో ఉద్యోగులను తొలగించింది.


Click it and Unblock the Notifications