Chip Making: ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ కొత్త రంగాల్లోకి విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ప్రపంచ అవసరాలకు అవసరమైన ఉత్పత్తులను మేక్ ఇన్ ఇండియా కింద జరిగేలా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
తాజాగా భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ చిప్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు మైక్రోన్ టెక్నాలజీతో గుజరాత్ ప్రభుత్వం మధ్య ఎంఓయూ జరిగింది. ఒప్పందం ప్రకారం ఫ్యాక్టరీని గుజరాత్‌లోని సనంద్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీని కింద కంపెనీ దేశంలో రూ.22,540 కోట్లు లేదా 2.75 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో మెగా పెట్టుబడి ఒప్పందం జరిగింది. ఇందులో మైక్రాన్ భారత ప్రభుత్వం నుంచి మొత్తం ప్రాజెక్ట్ వ్యయానికి 50% ఆర్థిక సహాయాన్ని అందుకోనుంది. అలాగే ఒప్పందం ప్రకారం గుజరాత్ ప్రభుత్వం నుంచి మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 20% ప్రోత్సాహకాలను పొందుతుందని వెల్లడైంది. ప్రపంచంలో అతిపెద్ద జనాభాలో కూడిన భారత మార్కెట్ భారత్ సెమీకండక్టర్ చిప్‌ల దిగుమతిపై ఆధారపడి ఉన్నందున.. తయారీ రంగం వృద్ధి చెంది డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.
దేశంలో మైక్రాన్ పెట్టుబడి సెమీకండక్టర్ ఉత్పత్తిలో గ్లోబల్ హబ్‌గా మారాలనే భారత ఆశయాలను సుస్థిరం చేయనుంది. అమెరికా-చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో కంపెనీలు తమ కార్యకలాపాలను చైనా నుంచి ఇతర సురక్షితమైన దేశాలకు తరలిస్తున్నాయి. ఇది ఇండియాకు కలిసొస్తోంది. ఇది స్వాగతించదగిన పరిణామమే అయినప్పటికీ.. ప్యాక్టరీ గుజరాత్ కు వెళ్లటం వ్యాపార నిర్ణయాల్లో రాజకీయ పరిగణలపై ప్రశ్నలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications