Intel Layoffs: మెటా తర్వాత ఇంటెల్ మెగా లేఆఫ్స్.. చిప్ మేకర్ భారీ లేఆఫ్స్..
Intel Mass Layoffs: అమెరికాకు చెందిన టిక్ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కంపెనీల వ్యాపారాలు ఊహించిన స్థాయిలో వృద్ధిని చూడకపోవటంతో ఉద్యోగుల కోతలతో లాభదాయకతను మెరుగుపరుచుకునేందుకు సదరు కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. దాదాపు రెండేళ్లకు పైగా కరోనా తర్వాత గడిచిపోయినప్పటికీ కంపెనీల్లో కోతలు ఆగకపోవటం పరిశ్రమవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆందోళలను పెంచేస్తున్నాయి.
తాజాగా అమెరికాలోని క్యాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న చిప్ తయారీదారు ఇంటెల్ మాస్ లేఆఫ్స్ ప్రకటించింది. దీని కింద అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న దాదాపు 2000 మంది ఉద్యోగులను కంపెనీ ఇంటికి పంపించింది. వాస్తవానికి ఖర్చుల మదింపులో భాగంగానే ఈ తొలగింపులు వచ్చాయని తెలుస్తోంది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. లేఆఫ్స్ కారణంగా ఒరెగాన్‌లో దాదాపు 1,300 మంది ఉద్యోగులు, అరిజోనాలో 385 మంది ఉద్యోగులు, కాలిఫోర్నియాలో 219 మంది ఉద్యోగులతో పాటు టెక్సాస్‌లో మరో 251 ఉద్యోగాల కోత ఉంటుందని వార్తా నివేదికల ప్రకారం వెల్లడైంది. ఆగస్టుకు ముందు కంపెనీ ప్రకటించిన 15,000 తొలగింపుల్లో భాగంగా ప్రస్తుత తొలగింపులు వచ్చాయని ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ తెలిపారు.

ఖర్చులను తగ్గించుకోవడానికి, చిప్-మేకింగ్ విభాగాన్ని పెంపొందించడానికి కొత్త దశలను వేస్తూ, ఇంటెల్ దాని చిప్-తయారీ, డిజైన్ కార్యకలాపాలను వేరు చేస్తుందని సెప్టెంబర్‌లో గెల్సింగర్ ప్రకటన చేశారు. ఈ విభజన కారణంగా అవి స్వతంత్రంగా ఫైనాన్సింగ్ పొందగలవని అన్నారు, కాంట్రాక్ట్ చిప్ మేకర్‌తో మరింత సాంస్కృతికంగా దానిని తీసుకురాగలదన్నారు. ఈ క్రమంలోనే కంపెనీ జర్మనీ, పోలాండ్ ఫ్యాక్టరీల్లో ప్రాజెక్టులను రెండేళ్ల పాటు నిలిపివేస్తోంది. డిమాండ్ తిరిగి పెరిగేంతవరకు మలేషియాలోని తయారీ యూనిట్ హోల్డ్ లో ఉంచాలని నిర్ణయించింది. కంపెనీ 2025లో ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రాంతీయ ఎంగేజ్మెంట్ మోడళ్లను అమలు చేసేందుకు వీలుగా అనుభవజ్ఞుడైన డేవ్ గుజ్జీని బోర్డులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
మెటా లేఆఫ్స్..
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మెటా తన లేఆఫ్ స్పీ కొనసాగిస్తూనే ఉంది. 2022 నుంచి వరుసగా ఐదవసారి టెక్ దిగ్గజం తన తొలగింపులను కొనసాగిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం కుదుటపడటంతో ఇటీవల ఫెడ్ చర్యలు ప్రపంచ వ్యాప్తంగా జాబ్ మార్కెట్లలో కొత్త సంతోషాన్ని నింపాయి. ఈ క్రమంలో రిక్రూట్మెంట్లు సైతం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా గతంలో సోషల్ మీడియా విభాగంలో వేల సంఖ్యలో ఉద్యోగులను కత్తిరించిన సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మరియు రియాలిటీ ల్యాబ్‌లతో సహా వివిధ విభాగాలలో ఉద్యోగులను తొలగించడం మెటా ప్రారంభించింది. ఈ కోతలు నిర్దిష్ట జట్లలో పునర్నిర్మాణానికి సంబంధించినవి.


Click it and Unblock the Notifications