Fed Meeting: కరుణించని పావెల్.. వడ్డీ రేట్లను మార్చని యూఎస్ ఫెడ్.. మనకేంటి..??
US Fed Meeting: ప్రపంచ పెద్దన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ తాజాగా కీలక వడ్డీ రేట్ల విషయంలో ప్రకటన చేసింది. వరుసగా 5వ సమావేశంలో కూడా రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని ఫెడ్ ఛైర్ జెరోమ్ పావెల్ నిర్ణయించారు.
ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా అధికా స్థాయిల్లోనే కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం మహమ్మారిని అదుపులో ఉంచేందుకు మరికొంత కాలం పాటు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఫెడ్ ప్రతిపాదించింది. ఇలాంటి పరిస్ఖితుల్లో తాము వడ్డీ రేట్లను తగ్గించే ఉద్ధేశంలో ప్రస్తుతం లేమని పావెల్ ప్రకటించారు.

అయితే అమెరికా స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడిదారులు మాత్రం ఈ వేసవి నాటికి తొలి రేటు తగ్గింపు ప్రకటన ఫెడ్ నుంచి ఉండొచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ తరుణంలో ఫెడ్ అధికారులు వడ్డీ రేట్లను తొందరపడి తగ్గించటం, లేటుగా తగ్గించంటమనే ఆలోచనల మధ్య నలిగిపోతున్నారు. అందువల్ల మెుదటి రేటు తగ్గింపు ప్రకటన చాలా కీలకంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఫెడ్ 2024 ముగింపు నాటికి వడ్డీ రేట్లు 3 దఫాలుగా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఫెడ్ అధికారులు తాడా ఎకనమిక్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఇప్పుడు డిసెంబర్‌లో అంచనా వేసిన దాని కంటే రాబోయే సంవత్సరాల్లో తక్కువ రేటు తగ్గింపులను ఆశిస్తున్నారని వారు చూపిస్తున్నారు. ఫెడ్ పాలసీ రూపకర్తలలో ఎక్కువ మంది ఈ సంవత్సరం మూడు రేట్ల తగ్గింపులను ఆశిస్తూనే ఉన్నారు. అయితే వడ్డీ రేట్లలో ఉపశమనాన్ని ప్రజలు 2025-2026 మధ్యనాటికి పొందవచ్చని తెలుస్తోంది. దీర్ఘకాలంలో వడ్డీ రేట్లు డిసెంబరులో అంచనా వేసిన దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటాయని వారు భావిస్తున్నారు.
ఫెడ్ నిర్ణయం పరోక్షంగా భారతీయ ప్రజలను సైతం ప్రభావితం చేయనుంది. వాస్తవానికి అమెరికా వడ్డీ రేట్లను తగ్గిస్తే అదే దానికి భారతీయ రిజర్వు బ్యాంక్ కూడా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫెడ్ రేట్ల తగ్గింపును ఆలస్యం చేస్తే దేశీయంగా వ్యక్తిగత రుణ గ్రహితలు, వ్యాపారులు, బిజినెస్ యూనిట్లు అధిక వడ్డీ రేట్ల ప్రభావాన్ని ఎక్కువ కాలం పాటు అనుభవించాల్సి ఉంటుంది. ఇది భారత ఆర్థిక వృద్ధిని కూడా కొంత నెమ్మదింపచేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications