అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక సాహసోపేతమైన, వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు బందీగా పట్టుకోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అయితే ఈ పరిణామం ఇప్పుడు భారతదేశాన్ని ఒక క్లిష్టమైన డిప్లమాటిక్ డైలమాలో(Diplomatic Dilemma) నెట్టింది. ఒకవైపు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన అమెరికా, మరోవైపు అంతర్జాతీయ చట్టాల గౌరవం.. ఇప్పుడు భారత్ ఏం చేయబోతోంది? ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్‌కు ఎందుకు ఈ ఇబ్బంది?
భారతదేశం ఎప్పుడూ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంది. "ఏ దేశం కూడా మరో దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు". అయితే ఇప్పుడు ట్రంప్ ఏకపక్షంగా వెనిజులా (Venezuela) పై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడినే కిడ్నాప్ చేశారు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం. గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల)కు నాయకత్వం వహిస్తున్న భారత్.. దీనిపై స్పందించకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉంది.
చమురు వ్యాపారం, ఆంక్షల ఎఫెక్ట్
ఒకప్పుడు వెనిజులా భారత్‌కు ప్రధాన చమురు సరఫరాదారు. 2019-20లో మన ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 6,397 మిలియన్ డాలర్లు. కానీ, అమెరికా ఆంక్షల వల్ల మనం వెనిజులా నుంచి ముడి చమురు దిగుమతులను భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది.
2022-23 నాటికి వాణిజ్యం కేవలం 431 మిలియన్ డాలర్లకు పడిపోయింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఇప్పటికే ట్రంప్ భారత్‌పై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు వెనిజులా విషయంలో భారత్ అమెరికాను వ్యతిరేకిస్తే, వాణిజ్యపరంగా మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
మదురోతో భారత్‌కు ఉన్న సంబంధాలు
రాజకీయంగా వెనిజులాతో మనకు పెద్దగా పేచీలు లేవు. 2005లో హ్యూగో చావెజ్ భారత్ పర్యటనతో మన సంబంధాలు బలపడ్డాయి. నికోలస్ మదురో కూడా 2012లో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా సుష్మా స్వరాజ్, ఎస్. జైశంకర్ వంటి నేతలు వెనిజులా ప్రతినిధులతో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నారు.
భారతీయులకు హై అలర్ట్
ప్రస్తుతం వెనిజులాలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో కేంద్ర విదేశాంగ శాఖ (MEA) అక్కడ ఉన్న భారతీయులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. "అత్యవసరమైతే తప్ప వెనిజులాకు ప్రయాణాలు పెట్టుకోవద్దు. అక్కడ ఉన్న వారు కూడా కరాకస్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉండండి." అని ప్రకటించింది.
ప్రపంచ దేశాల స్పందన: భారత్ మౌనం వెనుక?
రష్యా ఇప్పటికే అమెరికా చర్యను "సాయుధ దురాక్రమణ"గా అభివర్ణించి ఖండించింది. యూరోపియన్ యూనియన్ కూడా ఆచితూచి స్పందిస్తూ సంయమనం పాటించాలని కోరింది. కానీ, భారత్ మాత్రం ఇంకా అధికారికంగా అమెరికాను విమర్శించలేదు. ట్రంప్ 2.0 హయాంలో అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా వెనిజులాలోని డ్రగ్ కార్టెల్స్‌ను ఏరివేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టింది.
మొత్తానికి భారతదేశానికి వెనిజులాతో రాజకీయ ప్రయోజనాలు తక్కువగా ఉన్నప్పటికీ.. "నైతిక విలువలు", "అంతర్జాతీయ చట్టాల" విషయంలో మాత్రం పెద్ద పరీక్ష ఎదురైంది. ఒక మిత్రదేశం చట్టాలను ఉల్లంఘిస్తున్నప్పుడు మౌనంగా ఉండాలా? లేక నిలదీయాలా? అనే విషయంలో ఢిల్లీ ఆచితూచి అడుగులు వేస్తోంది.
More From GoodReturns

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications