అమెరికాలో వ్యాపారం చేయాలనుకునే భారతీయులకు బిగ్ షాక్.. వ్యాపారాలపై ప్రభావం చూపే కీలక విధాన మార్పును అమెరికా స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (SBA) తాజాగా ప్రకటించింది.చిన్న వ్యాపార యజమానులకు రుణాల ద్వారా సపోర్ట్ ఇచ్చే ఈ ప్రభుత్వ సంస్థ.. ఫిబ్రవరి 2 (అమెరికా కాలమానం ప్రకారం) న కొత్త పాలసీ నోటీసును విడుదల చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన అమెరికా ఫస్ట్' ఎజెండాను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ తాజా సవరణ ప్రకారం.. US పౌరులు కాని వారి యాజమాన్యంలో ఉన్న Business ఇకపై SBA రుణాలకు అర్హులు కావు. ఇందులో గ్రీన్ కార్డ్ హోల్డర్లు (చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు - LPRలు) కూడా ఉంటారు. ఇది ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానానికి పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం. ఈ కొత్త మార్గదర్శకాలు మార్చి 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.

SBA నిర్వాహకురాలు కెల్లీ లోఫ్లర్ విడుదల చేసిన పాలసీ నోటీసులో.. చిన్న వ్యాపార దరఖాస్తుదారుని ప్రత్యక్ష లేదా పరోక్ష యజమానులలో 100 శాతం మంది US పౌరులు లేదా అమెరికాలో ప్రధాన నివాసం కలిగిన US జాతీయులే కావాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నోటీసుతో గతంలో అమల్లో ఉన్న SOP 50 10 8 విధానానికి సంబంధించిన పాత మార్గదర్శకాలు రద్దు అయ్యాయి.
డిసెంబర్ 2025లో జారీ చేసిన నోటీసులో.. పరిమిత మినహాయింపుగా విదేశీ పౌరులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్లు గరిష్టంగా 5 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉండేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు విడుదల చేసిన తాజా నోటీసులో.. LPRలు ఏ శాతం యాజమాన్యాన్ని కూడా కలిగి ఉండకూడదని స్పష్టంగా పేర్కొనడం వల్ల పెద్ద ఎత్తున వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది.
ఈ మార్పు 13 CFR 120.100,ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14159 (అమెరికన్ ప్రజలను అక్రమ వలసల నుండి రక్షించడం)కు అనుగుణంగా ఉందని SBA తెలిపింది. అయితే, ఈ నిర్ణయం వలసదారుల వ్యాపార అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సెన్ కాల్ బిజినెస్ ఫైనాన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రాంక్ గల్లెగోస్ ఈ విధాన మార్పును చూసి షాక్‌కు గురయ్యామని తెలిపారు. తమ సంస్థ ఇచ్చే SBA రుణాల్లో దాదాపు 10 శాతం వరకు గ్రీన్ కార్డ్ హోల్డర్ల యాజమాన్యంలోని వ్యాపారాలేనని ఆయన వెల్లడించారు. కొత్త నిబంధనల కారణంగా, ఈ వ్యాపారాలు యాజమాన్యాన్ని US పౌరులకు బదిలీ చేయాల్సి రావచ్చని లేదా ప్రత్యామ్నాయ ఫైనాన్సింగ్ మార్గాలను వెతకాల్సి ఉంటుందని చెప్పారు.
డెమోక్రటిక్ పార్టీ నేతలు కూడా ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకించారు. సెనేట్, హౌస్ స్మాల్ బిజినెస్ కమిటీల ర్యాంకింగ్ సభ్యులు దీనిని వలసదారుల వ్యవస్థాపకతపై దాడిగా అభివర్ణించారు. భారతీయులపై ఈ నిర్ణయం ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
USCIS గణాంకాల ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో గ్రీన్ కార్డ్ పొందిన వలసదారుల్లో భారతదేశం రెండో అతిపెద్ద మూల దేశం. అంతేకాదు, అమెరికాలోని హోటల్ రంగంలో సుమారు 60 శాతం యాజమాన్యం భారత సంతతికి చెందిన వారిదే. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ నివేదిక ప్రకారం.. భారతీయ అమెరికన్ యాజమాన్యంలోని వ్యాపారాలు ఏటా 150 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం ఆర్జిస్తూ..8 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఏదేమైనా SBA తాజా విధాన మార్పు భారతీయ వ్యాపార వర్గాలకు మాత్రమే కాకుండా, అమెరికా చిన్న వ్యాపార వ్యవస్థ మొత్తానికే గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications