Jeff Bezos News: టాప్ కంపెనీలను స్థాపించి వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే నాయకుల వేతనాలపై ఎల్లప్పుడూ డిస్కషన్ కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఇండియాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేక ముఖేష్ అంబానీ సైతం కంపెనీ నుంచి ఎలాంటి వేతనాన్ని అందుకోవటం లేదు.
అయితే ప్రపంచ కుబేరుల్లో రెండవ స్థానంలో కొనసాగుతున్న జెఫ్ బెజోస్ ఇటీవల తాజాగా తన వేతనానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు.తాను ఏడాదికి 80 వేల డాలర్లు స్థిరవేతనం కింద అందుకుంటున్నట్లు వెల్లడించారు. భారత కరెన్సీ లెక్కల ప్రకారం ఏడాదికి కేవలం రూ.67 లక్షలు అందుకుంటున్నట్లు బెజోస్ ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను అందుకుంటున్న బేసిక్ పే 1998 నుంచి ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే బిలియనీర్స్ ఇండెక్స్ వివరాల ప్రకారం 241 బిలియన్ డాలర్లుగా ఉంది.

అయితే కావాలనే ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తన వేతనాన్ని తక్కువగా ఉంచుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గతంలో ఆయన వెల్లడించారు. సంస్థ వ్యవస్థాపకుడిగా ఉన్న తాను ఇప్పటికే కంపెనీలో అధిక భాగాన్ని హోల్డ్ చేస్తున్నానని అందువల్ల సంస్థ నుంచి అధికంగా కాంపెన్సేషన్ పొందాలని అనుకోవటం లేదని పేర్కొన్నారు. తన ఆర్థిక ప్రేరణ అమెజాన్‌లో తన పెద్ద వాటా నుండి వచ్చిందని పేర్కొన్నారు. బెజోస్ అమెజాన్‌లో హోల్డ్ చేస్తున్న షేర్ల నుండి మిలియన్ల డాలర్లు సంపాదించారు. 2023-24 మధ్య కాలంలో గంటకు దాదాపు 8 మిలియన్ డాలర్లను సంపాదించారు. అయితే దీనికి కారణం పెరిగిన అతని వాటాల విలువేనని తెలుస్తోంది. కంపెనీలో 10 శాతానికిపైగా వాటా కలిగి ఉండటం తగినంత ప్రోత్సాహకమని బెజోస్ పేర్కొన్నారు.
తక్కువ జీతాన్ని కొనసాగించడానికి బెజోస్ విధానం కొన్ని పెద్ద ఆర్థిక చిక్కులను కలిగి ఉంది. ముఖ్యంగా పన్నుల విషయానికి వస్తే బెజోస్ 2007, 2011లో ఫెడరల్ ఆదాయపు పన్ను చెల్లించలేదని అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వెల్లడైంది. అమెరికాలోని అత్యంత సంపన్నుల జాబితాలో ముందు వరుసలో ఉన్న బెజోస్ తన జీతం కంటే ఎక్కువ పెట్టుబడి నష్టాలను నివేదించినట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో అమెరికాలోని సంపన్నుల జాబితాలో ఉన్న ఎలాన్ మస్క్, వారెన్ బఫెట్, మైకెల్ బ్లూమ్ బెర్క్ వంటి వారు సైతం నామమాత్రపు పన్నులు చెల్లించారు. సంపన్నులు తక్కువ పన్నులు చెల్లించడానికి ఇటువంటి వ్యూహాలను ఉపయోగించుకుంటారని విమర్శకులు వాదిస్తున్నారు. ఇది పన్ను న్యాయబద్ధత గురించి కొనసాగుతున్న చర్చలకు దారితీసింది. అయితే ప్రస్తుతం బెజోస్ అమెజాన్ కంపెనీలో నిరంతరం తన వాటాలను విక్రయిస్తూ వస్తున్నారు. 2025 చివరి నాటికి 25 మిలియన్ షేర్లను విక్రయించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications