Deloitte News: పరిస్థితులు చూస్తుంటే అమెరికా కంపెనీలు సైతం ఇటీవలి కాలంలో ఇండియన్ టెక్ కంపెనీల పాలసీలను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మాట వినని ఉద్యోగులను తిరిగి గాడిన పెట్టేందుకు డెలాయిట్ కూడా తన పాత పాలసీకి చెల్లు చీటీ చెప్పిందని తెలుస్తోంది.
డెలాయిట్ యూఎస్ ట్యాక్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగులందరికీ ఆఫీస్ హాజరును ఇకపై వారి పనితీరు మూల్యాంకనలో కీలకంగా పరిగణించబడుతుందని పేర్కొంది. ఇది వారి బోనస్‌లను ప్రభావితం చేయవచ్చు అని డెలాయిట్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో డెలాయిట్ యుఎస్ ట్యాక్స్ విభాగంలో ఉద్యోగులు ప్రతి వారం 2-3 రోజులు ఆఫీసులో పని చేయాలని కోరుతోంది. కొత్త విధానం కంపెనీలో ఉద్యోగులకు మరింత కఠినమైన హాజరుదారితనం విధానానికి మార్పును సూచిస్తోంది.

"డెలాయిట్ ఆఫీసులో లేదా కస్టమర్ సైట్‌లలో ఉద్యోగి హాజరై ఉండటం ఇప్పుడు పెర్ఫామెన్స్ బోనస్ లెక్కించటంలో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది" అని యూఎస్ ట్యాక్స్ సిబ్బందికి పంపిన సందేశంలో పేర్కొనబడింది. ఈ టీమ్‌లో పనిచేసే ఉద్యోగులు వారానికి 2-3 రోజులు అంటే 50% ఆఫీసులో లేదా కస్టమర్ సైట్‌లో ప్రత్యక్షంగా కలిసి పనిచేసేలా చూసుకోవాలని సూచించింది. కంపెనీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,60,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న బిగ్ ఫోర్ అకౌంటింగ్ సంస్థల్లో ఒకటి. కంపెనీ తన క్లయింట్లకు ఆడిట్, కౌన్సల్టింగ్, ట్యాక్స్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవలను అందిస్తోంది.
వాస్తవానికి డెలాయిట్ గత కొన్ని సంవత్సరాలుగా హైబ్రిడ్ వర్క్ విధానాన్ని ప్రమోట్ చేస్తోంది. తాజా నిర్ణయం యుఎస్ ట్యాక్స్ ప్రాక్టీస్‌కు సంబంధించినది,. ఇది కంపెనీ హైబ్రిడ్ వర్క్ విధానంలో మార్పును సూచిస్తుంది. 2014 నుంచి డెలాయిట్ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ నినాదంతో పనిచేస్తున్న సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మార్పు ఇతర పెద్ద సంస్థల చర్యలను అనుకరించడమే అని చెప్పవచ్చు. గూగుల్ కూడా 2023లో తమ ఉద్యోగుల పనితీరు మూల్యాంకనలో ఆఫీసు హాజరును పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అలాగే వాల్ స్ట్రీట్ సంస్థలు అయిన జేపీమోర్గన్, గోల్డ్మాన్ సాచ్స్ ఇంకా ఆఫ్-ఓఫీస్ రోజులను తగ్గించి. ఉద్యోగులను వారానికి ఐదు రోజులు ఆఫీసులో పని చేయాలని ఆదేశించాయి. తాజాగా జేపీమోర్గన్ సీఈవో జేమీ డిమన్ హోమ్ వర్క్ పట్ల వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆఫీసులో పని చేయడం ప్రోడక్టివిటీకి అవసరమని అభిప్రాయపడ్డారు. పీడబ్ల్యూసీ ఇటీవల తన యూకే ఉద్యోగులందరికీ 2025 నుంచి వారానికి కనీసం 60% సమయం ఆఫీసులో లేదా క్లయింట్ సైట్‌లలో పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక EY కూడా తన ఉద్యోగుల పాలసీని పర్యవేక్షించి, ట్రైనింగ్ సెషన్లలో పాల్గొనడం వంటి పరామర్శలు, అనుబంధ విధానాలను ఉల్లంఘించిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంది.


Click it and Unblock the Notifications