Tech Layoffs: ఇండియాలో ఉద్యోగులను తొలగించిన యూఎస్ టెక్ సంస్థ.. ఎందుకంటే..??
EXL Layoffs: అంతర్జాతీయంగా, ప్రధానంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీల్లో ఉద్యోగుల కోతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏఐ రంగంలో పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించింది.
ప్రపంచ వ్యాప్తంగా జనరేటివ్ ఏఐ కోసం పెరిగిన డిమాండ్‌కు ప్రతిస్పందనగా న్యూయార్క్‌లో ఉన్న Exl సర్వీస్ అనే ఐటీ సంస్థ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ తన ఉద్యోగులలో 2% కంటే తక్కువగా 800 స్థానాలకు తగ్గించింది. కంపెనీ తాజా నిర్ణయం కారణంగా ఇండియా, అమెరికాలో కంపెనీ కోసం పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం అవనున్నారు. వీరిలో 400 మంది కార్మికులు లేఆఫ్‌లను ఎదుర్కొంటుండగా.. మిగిలిన 400 మందికి కంపెనీలోని ఇతర విభాగాల్లో ఉపాధి పొందే అవకాశం ఇవ్వబడుతుంది.

ఉద్యోగాల కోత ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్, భారతదేశంలోని డేటా అనలిటిక్స్, డిజిటల్ కార్యకలాపాల్లో పనిచేస్తున్న జూనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. Exl సర్వీస్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో కంపెనీ సీఈవోగా ఉన్న రోహిత్ కపూర్ ప్రస్తుతం బోర్డు చైర్ గా పదోన్నతి పొందారు. ఇంకా వికాస్ భల్లా, వివేక్ జెట్లీ అనే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డేటా, AI ఆధారిత సొల్యూషన్స్‌తో కూడిన విస్తృత బాధ్యతలను స్వీకరిస్తున్నారు.
కంపెనీ ఏఐ, డేటాలో పరిజ్ఞానం ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించడం లక్ష్యంగా పునర్నిర్మాణం కొనసాగిస్తోందని సమాచారం. అలాగే కంపెనీ తన క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను నియమించుకునేందుకు ప్రస్తుతం ఉన్న పాత్రలను తిరిగి మూల్యాంకనం చేసే మిశ్రమం ఉంటుందని EXL ప్రతినిధి తెలియజేశారు.


Click it and Unblock the Notifications