Silicon Valley Bank: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు భారీ క్షీణతను నమోదు చేశాయి. అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మాతృ సంస్థ SVB ఫైనాన్సియల్ గ్రూప్ షేర్లు భారీగా పతనం కావటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ బ్యాంక్ ప్రధానంగా స్టార్టప్ కంపెనీలకు రుణాలను అందిస్తుంటుంది. బ్యాంక్ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉంది.

బ్యాంక్ వెల్లడి..
నిధుల కోసం కష్టపడుతున్న స్టార్టప్‌ల నుంచి డిపాజిట్లు తగ్గిపోవడంతో బ్యాంక్ తన బ్యాలెన్స్ షీట్‌ను పెంచుకోవడానికి 2.25 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. ఈ ప్రకటనతో బ్యాంక్ మార్కెట్ విలువ రూ.6.50 లక్షల కోట్లు(80 బిలియన్ డాలర్లు) మేర ఆవిరైంది. బ్యాంక్ షేర్ విలువ దాదాపు 60.41 శాతం క్షీణించింది. ఈ సమస్య కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైనప్పటికీ.. ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై కనిపిస్తోంది. జూన్ 2020 తర్వాత అమెరికా బ్యాంక్ ఇండెక్స్ ఇంత భారీ స్థాయిలో పతనం కావటం ఇదే తొలిసారి.
ఇండియాలో..
అమెరికా బ్యాంకింగ్ రంగంలో కంపనలు ఇండియాలోనూ కనిపిస్తున్నాయి. దేశీయ బ్యాంకింగ్ స్టాక్స్ సైతం నేడు మార్కెట్లో భారీగా క్షీణించాయి. దీనిపై ప్రముఖ బ్యాంక్ కోటక్ మహీంద్రా సీఈవో ఒక ట్వీట్ చేశారు. ఒక ఏడాదిలో వడ్డీ రేట్లు సున్నా నుంచి 500 బేసిస్ పాయింట్లకు చేరుకున్న తరుణంలో ఎక్కడో ఒకచోట ప్రమాదం జరగటానికి వేచి ఉందని ట్వీట్ చేశారు. గత ఏడాది కాలంలో ఫెడ్ తన వడ్డీ రేట్లను 4.5 శాతానికి పైగా పెంచింది. 2007 తర్వాత ఇదే అత్యధికమని ఉదయ్ కోటక్ తెలిపారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని ఫెడ్ ఇటీవల్ కీలక ప్రకటన చేయటం ఆందోళనలను పెంచుతోంది.

బ్యాంకు వ్యాపారం..
అయితే ప్రస్తుతం అమెరికాలో దిగ్గజ బ్యాంక్ లిక్విడిటీ క్రంచ్ ఎదుర్కొంటున్న తరుణంలో దీనిని చాలా మంది 2008 లేమన్ బ్రదర్ ఘటనతో పోల్చుతున్నారు. SVB సగం వ్యాపారం US వెంచర్ క్యాపిటల్-ఇన్వెస్ట్ చేసిన స్టార్టప్ కంపెనీలతో ముడిపడి ఉందని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. బ్యాంక్ వ్యాపారంలో 44 శాతం వరకు టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల కంపెనీలతో కలిసి నిర్వహిస్తోంది. వడ్డీ రేట్ల పెంపు ఈ రంగాలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు కంపెనీలు నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. అధిక వడ్డీ రేట్లు కొనసాగే అవకాశం ఉందని ఎస్‌విబి సీఈవో గ్రెగ్ బేకర్ బుధవారం ఒక లేఖలో తెలిపారు. ఇది మా ఖాతాదారుల ముందు నగదు కొరతను కలిగిస్తుంది. అందుకే షేర్లను విక్రయించాలని నిర్ణయించినంట్లు తెలిపారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications