Airtel Stock: నేడు స్టాక్ మార్కెట్లో టెలికాం మేజర్ ఎయిర్‌టెల్ కంపెనీ షేర్లు ఫోకస్‌లో ఉన్నాయి. గతంలో అదానీ కంపెనీ షేర్లపై బెట్టింగ్ వేసి భారీ లాభాలను అందుకున్న ఇన్వెస్టర్ కన్ను తాజాగా టెలికాం సంస్థపై పడింది. దీంతో భారీగా పెట్టుబడి పెట్టారు.
ప్రముఖ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్ టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ కంపెనీకి చెందిన 4.9 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. రాజీవ్ జైన్ US ఆధారిత పెట్టుబడి సంస్థ GQG పార్టనర్స్ ప్రమోటర్ గ్రూప్ యూనిట్ సింగపూర్ టెలికాం లేదా సింగ్‌టెల్ నుంచి తాజాగా వాటాను కొన్నారు. సుమారు రూ.5,849 కోట్లు వెచ్చించి కంపెనీలో 0.8 శాతం వాటాను దక్కించుకున్నారు. డేటా సెంటర్, ఐటీ సేవల అభివృద్ధికి నిధులను సమకూర్చడంతో పాటు రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఎయిర్‌టెల్‌లో వాటాను విక్రయించినట్లు సింగ్‌టెల్ వెల్లడించింది.

సింగ్‌టెల్ అనుబంధ సంస్థ పెస్టిల్ లిమిటెడ్ ద్వారా విక్రయించిన తర్వాత, భారతీ ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్ వాటా 29.8% నుంచి 29%కి తగ్గింది. దీనికి ముందు 2022లో కూడా సింగ్‌టెల్ ఎయిర్‌టెల్‌లో 3.3% డైరెక్ట్ వాటాను విక్రయించింది. ఎయిర్‌టెల్ యాజమాన్యం సునీల్ భారతి మిట్టల్ కుటుంబం, సింగపూర్ ఆధారిత సింగ్‌టెల్‌కు చెందినది. అలాగే 2022లో గూగుల్ ఎయిర్‌టెల్‌లో 1.18% వాటాను ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా రూ.734 ఇష్యూ ధరకు కొనుగోలు చేసింది.
ఈ బ్లాడ్ డీల్ వార్తతో నేడు బీఎస్ఈలో 0.50 శాతం పెరిగి రూ.1,213.05కు చేరుకున్నాయి. ఇది స్టాక్ సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర. తాజా ర్యాలీ కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ రూ.6.75 లక్షల కోట్లకు పెరిగింది.
GQG పార్టనర్స్‌కు కూడా అదానీ గ్రూప్ కంపెనీలలో పెద్ద వాటా ఉంది. గత ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ సంక్షోభం సమయంలో రాజీవ్ జైన్ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసి భారీ బెట్టింగ్ చేశారు. దీంతో ఆయన దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా సంచలనంగా మారారు. ప్రస్తుతం అదానీకి చెందిన ఆరు కంపెనీలతో పాటు, ITC, పతంజలి ఫుడ్స్, IDFC ఫస్ట్ బ్యాంక్, JSW ఎనర్జీ, మాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్ షేర్లలో కూడా వాటాలను కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications