IT Jobs: అమెరికాకు చెందిన ఐటీ కంపెనీలు భారత టెక్కీలకు ముందు నుంచి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే.. వచ్చే మూడేళ్లలో భారతదేశంలో ఉద్యోగుల సంఖ్యను మూడు రెట్లు పెంచి.. 8,500కి చేర్చాలని అమెరికాకు చెందిన అకోలైట్ డిజిటల్ కంపెనీ యోచిస్తోంది. టెక్సాస్‌కు చెందిన ఈ ఐటీ సంస్థ తమ ఉద్యోగుల సంఖ్యను మూడు రెట్లు చేయాలనుకుంటున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కంపెనీ వ్యాపారాలు..
అకోలైట్ డిజిటల్ ఫౌండర్, CEO లీలా కాజా మాట్లాడుతూ.. కంపెనీ ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచి 500 మిలియన్ డాలర్లకు పెంచాలని, 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను 10,000 మందికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. "మా వ్యాపారాన్ని 2025 నాటికి సగం బిలియన్ స్థాయికి పెంచడమే లక్ష్యం. మా మూడు ప్రధాన వర్టికల్స్ BFSI (బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), TMT (టెక్నాలజీ, మీడియా, టెలికాం), హెల్త్‌కేర్‌లో వృద్ధి లక్ష్యం. మేము డిజిటల్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్, క్లౌడ్, DevOps, డేటా & AI, కస్టమర్ ఎక్స్ పీరియన్స్, సైబర్ భద్రత, డిజైన్ సేవలు," అందిస్తున్నట్లు కాజా తెలిపారు.

వేగంగా ఎదుగుతూ.. భారత్ లో వ్యాపారం..
కంపెనీ 35 నుంచి 50 శాతం అగ్రగామి వృద్ధి రేటుతో స్థిరంగా వ్యాపారాన్ని వృద్ధి చేస్తోంది. కంపెనీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2,600 మంది నిపుణులను కలిగి ఉంది. అందులో 2,400 మంది భారతదేశంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీకి బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, చెన్నై, ముంబై, పూణేలలో 6 డిజిటల్ ల్యాబ్‌లు ఉన్నాయి. ఇదే సమయంలో లాటిన్ అమెరికా, తూర్పు యూరప్, శ్రీలంకలో కార్యకలాపాలను స్కేల్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

కొత్త కొనుగోళ్లు..
ప్రైవేట్ ఈక్విటీ క్యాపిటల్ సంస్థ న్యూ మౌంటైన్ క్యాపిటల్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. కంపెనీ ఇటీవలే కెనడా ఆధారిత క్లౌడ్ మరియు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్ అయిన Xerrisని కొనుగోలు చేసింది. రాబడిని పెంచుకునేందుకు కంపెనీ ఈ డీల్ చేసుకున్నట్లు తెలిపింది. కంపెనీ అమెరికా, కెనడా, యూకేలలో వృద్ధితో పాటు మెక్సికోలోనూ కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications