Hindenburg Shutting Down: 2023 జనవరిలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ భారతీయ స్టాక్ మార్కెట్లకు బాంబు లాంటి రిపోర్ట్ ఒకటి విడుదల చేసింది. ప్రపంచకుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ వ్యాపారాలను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ మార్కెట్లను షేక్ చేసింది. లిస్టెడ్ అదానీ కంపెనీల షేర్ల పతనానికి అది దారితీసిన సంగతి తెలిసిందే.
ఒక సారి చరిత్రలోకి వెళితే హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన అనేక కంపెనీలు తమ విలువను కోల్పోయాయి. కానీ అదానీ విషయంలో ప్రకంపనలు సృష్టించగలిగినప్పటికీ అదానీ గ్రూప్ వాటిని తట్టుకోగలిగింది. దీని వ్యవస్థాపకుడైన నెటె యాండర్సన్ తాజాగా జనవరి 15, 2025న ఒక ప్రకటన చేశారు. తాము ఉద్ధేశించుకున్న ప్రణాళికలను పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం కంపెనీని మూసివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించాడు. దీనిని నిర్మించటం తన జీవితకలగా ఆయన పేర్కొన్నారు.

వాస్తవానికి తాను ఈ నిర్ణయం తీసుకోవటంపై ఏడాది నుంచి సంగ్ధిదతలో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆరోపణలు గుప్పించిన హిండెన్‌బర్గ్ పై అదానీ గ్రూప్ న్యాయపోరాటం చేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా రెండేళ్ల తర్వాత పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. అదానీ గ్రూప్ తిరిగి తన పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోగా ఆరోపణలు చేసిన సంస్థ మాత్రం కనుమరుగవుతోంది. అయితే దీని వెనుక ఏం జరిగింది అనే విషయం మాత్రం పెద్ద మిస్టరీగా మారిపోయింది.
హిండెన్‌బర్గ్ ఎలా సంపాదిస్తుంది?
వాస్తవానికి అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఏదైనా సంస్థను టార్గెట్ చేయటానికి ముందు సదరు కంపెనీలో షార్ట్ పొజిషన్లను తీసుకుంటుంది. ఆర్థిక పరిభాషలో దీనికి అర్థం తెలుసుకోవాలంటే ఇదొక ట్రేడింగ్ టెక్నిక్. దీని కింద షేర్లను విక్రయించటాని సదరు వ్యక్తులు కంపెనీకి చెందిన షేర్లను తాము హోల్డ్ చేయనప్పటికీ విక్రయించటానికి అప్పుగా తీసుకుంటుంటారు. ఇలా అధిక మెుత్తంలో షేర్లను అమ్మటంతో పాటు హిండెన్‌బర్గ్ ఇచ్చే రిపోర్టు మార్కెట్లలో ప్రకంపనలకు దారితీస్తుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళనతో సదరు కంపెనీ షేర్లను విక్రయించటం ప్రారంభించాక హిండెన్‌బర్గ్ తిరిగి తక్కువ రేట్లకు షేర్లను కొనుగోలు చేస్తుంటుంది. దీంతో భారీ లాభాలను సంపాదిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications