IDFC FIRST Bankలో పెట్టుబడి పెట్టిన అమెరికా సంస్థ GQG.. పూర్తి వివరాలు..
IDFC FIRST Bank: ఒకప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎక్కువగా వాటాలను కొంటూ వార్తల్లో నిలిచింది జీక్యూజీ పార్ట్నర్స్ సంస్థ. అమెరికాకు చెందిన ఈ సంస్థ ఇటీవల ఇతర కంపెనీల్లో సైతం తన పెట్టుబడులను కొనసాగిస్తోంది.
తాజాగా IDFC ఫస్ట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ V వైద్యనాథన్ నుంచి GQG పార్టనర్స్ సోమవారం 5,07,39,653 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్లు బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లు BSEలో దాదాపు 2 శాతానికి పైగా పెరిగాయి. ఈ విక్రయం ద్వారా వచ్చిన మెుత్తాన్ని బ్యాంక్ షేర్లను తిరిగి కొనేందుకు, సంబంధిత టాక్స్ చెల్లింపులకు, ముందుగా కట్టుబడి ఉన్న సామాజిక కారణాలకు సహకారం అందించడానికి వినియోగిస్తామని తెలిపింది.

IDFC FIRST బ్యాంక్ కొత్త షేర్లకు సబ్‌స్క్రయిబ్ చేయడానికి రూ.478.7 కోట్ల విక్రయం ద్వారా వచ్చిన మెుత్తంలో.. రూ.229 కోట్లను వినియోగించాలని నిర్ణయించింది. స్టాక్ ఆప్షన్స్ అనుసంధానించబడిన ఆదాయపు పన్ను కోసం రూ.240.5 కోట్లు; నిర్ధేశించిన సామాజిక కారణాలకు విరాళాల కోసం రూ.9.2 కోట్లును కేటాయించనుంది.
క్యాపిటల్ ఫస్ట్ డిసెంబరు 2018లో IDFC బ్యాంక్‌తో విలీనం చేయబడింది. IDFC బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ మధ్య అంగీకరించిన మెర్జర్లో భాగంగా ఈ క్యాపిటల్ ఫస్ట్ CMD స్టాక్ ఆప్షన్‌లు IDFC ఫస్ట్ బ్యాంక్ స్టాక్ ఆప్షన్‌లుగా మార్చబడ్డాయి. వాటి గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారు. సాయంత్రం 3.08 గంటల సమయంలో ఐడిఎఫ్‌సి బ్యాంక్ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.96.65 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications