Adani Power: ప్రస్తుతం అదానీ తన వ్యాపార విస్తరణలో కొత్త టెక్నిక్ ఫాలో అవుతున్నారు. గతంలో మాదిరిగా ర్యాపిడ్ ఎక్స్‌ప్యాన్షన్ కోసం అప్పుల బాట పట్టకుండా ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ GQG పార్ట్‌నర్స్ చాలా కీలకంగా మారింది. ఈ సంస్థ హిండెన్ బర్గ్ వలలో పడి అదానీ గ్రూప్ కంపెనీలు విలవిల్లాడుతున్న సమయంలో భారీ మెుత్తంలో పెట్టుబడులను పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంస్థ ప్రధానంగా దేశంలో అదానీ గ్రూప్ కంపెనీలతో పాటుగా రామ్‌దేవ్ బాబాకు చెందిన పతాంజలిలో సైతం ఇన్వెస్ట్ చేసింది. పైగా తన పెట్టుబడులను క్రమంగా విస్తరిస్తోంది.

తాజాగా జీక్యూజీ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ పవర్ లో 8.1 శాతం ఈక్విటీ వాటాలను సొంతం చేసుకుంది. బల్క్ డీల్ ద్వారా భారీగా షేర్లు చేతులు మారాయని వెల్లడైంది. ఈ డీల్ విలువ రూ.9,000 కోట్లుగా ఉన్నట్లు నిన్న మార్కెట్ ముగిసిన తర్వాత బయటకొచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో అదానీ పవర్ స్టాక్ నేడు మార్కెట్లో 9.30 గంటల సమయంలో లాభపడి రూ.284.70 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు విడుదల తర్వాత అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో సగానికి పైగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్చి మాసంలో US-ఆధారిత GQG భాగస్వాములు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీల్లో మెుత్తంగా 1.87 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఆ తర్వాత జూన్ నెలలో మరో 1 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయగా.. తాజాగా మరోసారి పెట్టుబడులను పెంచుకున్నట్లు డీల్ వెల్లడించింది.
విదేశీ పెట్టుబడుల వెల్లువ తర్వాత గత ఐదు నెలల కాలంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ దాదాపు 150 శాతం ఎగబాకడంతో స్టాక్‌లు బాగా కోలుకున్నాయి. GQG మార్చి నుంచి అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులపై భారీగా లాభాలను ఆర్జించింది. దాని ప్రస్తుత పెట్టుబడుల విలువ సుమారు 4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications