Adani News: అదానీకి మహర్ధశ పట్టింది.. 4 నెలల్లో మూడవసారి పందెం..!
Adani News: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వేగం పసికట్టడం చాలా కష్టం. గత కొన్నేళ్లుగా దూకుడు విస్తరణకు ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎక్కడా బెదరక ముందుకు సాగుతున్నారు.
జనవరి చివర్లో అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత కంపెనీ కోలుకున్న తీరు, వేగం ఎవ్వరూ ఊహించనిది. గతంలో షార్ట్ సెల్లర్ బారిన పడ్డ అనేక కంపెనీల మార్కెట్ విలువ ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయింది. కానీ వీటిని విజయవంతంగా అధిగమించటానికి అదానీపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకమే కారణంగా కనిపిస్తోంది.

ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో అమెరికాకు చెందిన అనుభవజ్ఞుడైన ఇన్వెస్టర్ GQG అదానీ కంపెనీ షేర్లపై పందెం వేసింది. ఇప్పటికే రెండు విడతల్లో భారీ మెుత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన సంస్థ తాజాగా మూడో విడతలో 1 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం నాలుగు నెలల కాలంలో GQG భాగస్వాములు చేసిన మూడవ రౌండ్ పెట్టుబడి కావటం గమనార్హం. మీడియా సమాచారం ప్రకారం.. GQG, ఇతర పెట్టుబడిదారులు బ్లాక్ డీల్ ద్వారా అదనంగా 1 బిలియన్ డాలర్ల విలువైన అదానీ గ్రూప్ షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.
ఈ డీల్ నేపథ్యంలో ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ నేడు మార్కెట్లో టాప్ గెయినర్ గా నిలిచింది. ఇదే క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్ కొత్తగా పెట్టుబడులను పెట్టింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల బ్లాక్ ట్రేడ్ రూ.2,300 వద్ద, అదానీ గ్రీన్ షేర్ల డీల్ ధర రూ.920 వద్ద జరిగిందని వెల్లడైంది. NRI రాజీవ్ జైన్ నేతృత్వంలోని GQG మార్చిలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీల్లో రూ.15,446 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుత పెట్టుబడులు దీనికి అదనం.


Click it and Unblock the Notifications