Intel layoffs: ఇంటెల్ ఉద్యోగులకు లేఆఫ్ సెగ.. ఆ కారణంగానే తాజా నిర్ణయం..
Intel layoffs: అమెరికా దిగ్గజ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక అస్థవ్యవస్థ పరిస్థితుల దృష్యా ఉద్యోగులను లేఆఫ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది తాజా రౌండ్ మాస్ లేఆఫ్‌లకు దారితీసింది.
కంపెనీ తన ఫోల్సమ్ క్యాంపస్‌లో 89 ఉద్యోగాలను.. శాన్ జోస్, కాలిఫోర్నియా కార్యాలయంలో 51 ఉద్యోగాలను తొలిగించినట్లు శాక్రమెంటో ఇన్నో నివేదిక వెల్లడించింది. నష్టాలను ఎదుర్కొన్న తర్వాత ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు కంపెనీ మేలో ప్రకటించిన ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా తొలగింపులు ఈ క్రమంలోనే వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నెలాఖరులోగా ఉద్యోగుల తొలగింపు అమల్లోకి వస్తుందని సమాచారం. ఇంటెల్ ఇతర ఉద్యోగులతో పాటు 10 GPU సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఎనిమిది మంది సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్లు, ఆరుగురు క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఆరు మంది ప్రొడక్ట్ మార్కెటింగ్ ఇంజనీర్లు, ఆరుగురు సిస్టమ్-ఆన్-చిప్ డిజైన్ ఇంజనీర్లను తొలగిస్తున్నట్లు పేర్కొంది.
ఇంటెల్ ఫోల్సమ్ క్యాంపస్ SSDలు, గ్రాఫిక్స్ ప్రాసెసర్‌లు, సాఫ్ట్‌వేర్ అండ్ చిప్‌సెట్‌ల అభివృద్ధితో సహా అనేక కార్యకలాపాల కోసం R&D విభాగాలను కలిగి ఉంది. అయితే ప్రతికూల వ్యాపార వాతావరణం మధ్య ఖర్చులను తగ్గించుకోవటానికి తొలగింపుల ప్రణాళికను కంపెనీ ప్రకటించింది. అనేక కార్యక్రమాల ద్వారా ఖర్చులను తగ్గించుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. సామర్థ్య లాభాలను గుర్తించడంపై దృష్టి సారించింది.
దీర్ఘకాలిక వృద్ధికి మంచి స్థితిలో ఉన్నామని నిర్ధారించుకోవడానికి తమ వ్యాపారానికి సంబంధించిన అంశాల్లో పెట్టుబడిని కొనసాగిస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఈ ఏడాది జూల్‌లో ఇంటెల్ "హైబ్రిడ్-ఫస్ట్" మోడల్‌పై దృష్టి సారిస్తోంది. దీనికి అనుగుణంగా కంపెనీ తన బెంగళూరు కార్యాలయాన్ని విక్రయించాలని చూస్తున్నట్లు కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. అయితే కంపెనీ కొత్త యజమానులతో లీజు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు ప్రాంతంలో కంపెనీ దాదాపు 14,000 మంది ఉద్యోగులనుకు కలిగి ఉంది. కంపెనీకి ఇది ముఖ్యమైన డిజైన్ అండ్ ఇంజనీరింగ్ కేంద్రం కూడా.


Click it and Unblock the Notifications