Goldman Sachs: భారత వృద్ధి జోరు ప్రపంచంలోని అనేక ఇతర దేశాలతో పోల్చితే మెరుగ్గా ఉంది. ప్రధానంగా ఆసియాలో భారత ఆర్థిక పరిస్థితి అనేక ప్రపంచ ఇన్వెస్టర్లను చాలా కాలంగా ఆకర్షిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మెరుపులు మసకబారుతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ ఇంక్ తాజాగా భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీ గురించి తన అంచనాలను ప్రకటించింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ వ్యయంలో తగ్గుదల కారణంగా ఈ ఏడాది అంటే 2024తో పాటు తదుపరి సంవత్సరం అంటే 2025 సంవత్సరాల్లో భారతదేశ వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గించింది.

2024 క్యాలెండర్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.7%, 2025లో 6.4% వృద్ధి చెందుతుందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుత సంవత్సరం డౌన్‌గ్రేడ్ కారకాలు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ వ్యయంలో 35% సంకోచానికి కారణమయ్యాయి. దేశంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన సార్వత్రిక ఎన్నికలు, US బ్యాంకు ఆర్థికవేత్త శాంతను సేన్‌గుప్తా నేతృత్వంలోని బృందం శుక్రవారం ఒక నివేదికలో పేర్కొంది.
ద్రవ్య లోటును స్థూల దేశీయోత్పత్తిలో 4.5% దిగువకు తీసుకురావడానికి బడ్జెట్‌లో ప్రభుత్వం కట్టుబడి ఉండటం వల్ల వచ్చే ఏడాది భారతదేశ వృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని అంచనా వేసింది. బ్యాంకుల ద్వారా సెక్యూర్డ్ లోన్స్ నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినమైన నిబంధనల కారణంగా గృహ రుణాల మందగమనంతో నెమ్మదించిన వాస్తవ వినియోగ వృద్ధి నుంచి విస్తరణ ప్రతికూల పవనాలను ఎదుర్కొంటుందని ఆర్థికవేత్తలు తెలిపారు. వారి అంచనాల ప్రకారం ఈ ఏడాది డిసెంబరులో భారతీయ రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపులను ప్రారంభించొచ్చని అంచనా వేశారు. ఇది తగ్గనున్న జీడీపీని కొంత భర్తీ చేయవచ్చని వారు చెబుతున్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications