అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారతీయులకు వీసాలు కష్టాలు పెరిగాయి. అమెరికా వీసాల కోసం భారత్‌లో చాలామంది చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఇండియన్లు వీసా అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో B1/B2 వీసా అపాయింట్‌మెంట్ కోసం వేచి ఉండే సమయం 7.5 నుంచి 13.5 నెలల వరకు పెరిగింది. ఇక చెన్నైలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. వేచ ఉండే సమయం 13.5 నెలలు వరకు పెరిగింది. దీంతో కుటుంబ వేడుకలు, బిజినెస్ ట్రిప్స్, అత్యవసర ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఆలస్యం కారణంగా వ్యక్తులు తమ కుటుంబ వేడుకలు, బిజినెస్ ట్రిప్స్, అత్యవసర ప్రయాణాలకు అమెరికా వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఓ గృహిణి న్యూయార్క్ లో జరిగే వివాహానికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెకు ఇప్పటికీ వీసా దొరకలేదు. పెళ్లి అయిపోయినప్పటికీ వీసా మాత్రం ఇంకా రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బిజినెస్ కోసం వెళ్లే వారి పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. అపాయింట్‌మెంట్ సిస్టమ్‌లో స్పష్టత లేకపోవడం, అలాగే priority slots ఎక్కువగా emergency లేదా F1 student visas కోసమే కేటాయించడం వలన బిజినెస్ ట్రావెలర్స్ కు అత్యంత ఇబ్బందికరంగా మారింది. వారికి ప్రయాణ ప్లానింగ్ అసాధ్యంగా మారుతోంది, ఎందుకంటే పోర్టల్‌ను రోజూ చెక్ చేసినా అపాయింట్‌మెంట్ దొరకడం చాలా కష్టమయిపోయింది.
F1 వీసా అప్లికెంట్లకు ప్రాధాన్యం: Travel Agents Federation of India - AP & Telangana చైర్మన్ ఫహీమ్ షేక్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సీజన్‌లో priority slots ఎక్కువగా F1 స్టూడెంట్ వీసా దరఖాస్తుదారులకు కేటాయిస్తున్నారు, వాళ్లు US లో వచ్చే అకడమిక్ సంవత్సరానికి సిద్ధం అవుతున్నారని తెలిపారు. దీంతో మిగతా వారికి వీసా స్లాట్లు దొరకడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది అమెరికా వెళ్లలేకపోతున్నారని తెలిపారు.
ఇంకొకవైపు - US ప్రభుత్వం వీసా అంక్షలు విధింపు: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమంగా అమెరికా వచ్చిన వారిపై కొరడా ఝళిపించారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్‌కు సహకరిస్తున్న ఇండియన్ ట్రావెల్ ఏజెన్సీలపై వీసా నిషేధం విధించారు. అమెరికా ప్రభుత్వం తాజాగా ఇలీగల్ ఇమిగ్రేషన్‌ను ప్రోత్సహిస్తున్న ట్రావెల్ ఏజెన్సీల అధినేతలు ఎగ్జిక్యూటివ్స్, మరియు సీనియర్ అధికారులపై వీసా రిస్ట్రిక్షన్స్ ప్రకటించింది. దీంతో వీసాలో కఠినతర నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీసాల జారీ కష్టతరంగా మారింది.
హ్యూమన్ స్మగ్లింగ్, ట్రాఫికింగ్‌పై అమెరికా ప్రభుత్వ ఉక్కుపాదం: Mission India (Embassy + Consulates) లోని Consular Affairs, Diplomatic Security Service.. ప్రతిరోజూ ఇలాంటి నెట్‌వర్క్స్‌ను గుర్తించి చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.ఇది గ్లోబల్ పాలసీ అయినందున Visa Waiver Program కు అర్హత ఉన్నవారికీ వర్తించవచ్చు.ఇదిలా ఉంటే న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ ప్రభావిత ఏజెన్సీల వివరాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వడానికి నిరాకరించింది.


Click it and Unblock the Notifications