For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హమయ్య... అమెరికా-చైనా మధ్య కుదిరిన డీల్, టారిఫ్ తిరకాసు!

|

దాదాపు పద్దెనిమిది నెలలుగా అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ సాగుతోంది. దీనికి ముగింపు పలికే దిశగా అడుగు పడుంది. దాదాపు ఏడాది కాలంగా ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, కొద్ది నెలల క్రితం వరకు టారిఫ్ పైన కాలు దువ్వుకున్నాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదిరింది. బుధవారం వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, చైనా ఉపాధ్యక్షులు లీయూ హీ ఒప్పందంపై సంతకం చేశారు.

SBI నుంచి అదిరిపోయే రీఫండ్ హోమ్‌లోన్ స్కీం: ప్రయోజనమెలా?SBI నుంచి అదిరిపోయే రీఫండ్ హోమ్‌లోన్ స్కీం: ప్రయోజనమెలా?

అయితే చైనా ఎగుమతులపై టారిఫ్ తగ్గింపుకు సంబంధించిన అంశాన్ని మాత్రం ఒప్పందంలో చేర్చలేదు. మేధో హక్కుల పరిరక్షణ, బలవంతపు సాంకేతిక బదలీకి ముగింపు, వివాదాల పరిష్కారలకు సమర్థవంత వ్యవస్థ ఏర్పాటు, కరెన్సీ మార్పులకు ముగింపు తదితర అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా చైనాకు అమెరికా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి.

 US and China sign deal to ease trade war

ఈ ఒప్పందాన్ని ట్రంప్ చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య న్యాయమైన పరస్పర వాణిజ్యానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టారిఫ్ తగ్గింపుపై రెండో దశ ఒప్పందంలో పరిశీలిస్తామన్నారు. తాజా ఒప్పందంతో అమెరికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ ఉన్నాయి.

English summary

హమయ్య... అమెరికా-చైనా మధ్య కుదిరిన డీల్, టారిఫ్ తిరకాసు! | US and China sign deal to ease trade war

The US and China have signed an agreement aimed at easing a trade war that has rattled markets and weighed on the global economy.
Story first published: Thursday, January 16, 2020, 13:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X