For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hyderabad: టీహబ్‌ని సందర్శించిన అమెరికా రాయబారి.. ప్రశంసల వర్షం..

|

T-Hub: తెలంగాణ ప్రపంచ దేశాలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో తాజాగా భారత్‌లో కొత్త అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి శుక్రవారం హైదరాబాద్‌ను 'భవిష్యత్తు' అన్నారు.

ఈ క్రమంలో ఎరిక్ ప్రతిష్ఠాత్మక టీహబ్ సందర్శించారు. ఈ ప్రదేశం తన ఊహలను ఆకర్షించింది. భవిష్యత్తు హైదరాబాదులో ఉందని అన్నారు. ఇక్కడి ప్రజల ఉత్సాహం, నగర పెరుగుదల, నిర్మాణాలు ఊపందుకోవటంలో దీనిని గమనించవచ్చని ప్రీమియమ్ స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను సందర్శించిన తర్వాత వ్యాఖ్యానించారు.

thub-

తెలంగాణ కేవలం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలోనే కాకుండా ఆలోచనలు, కలలను వాస్తవికత చేసే పాత్ర పోషిస్తోందని ఎరిక్ అన్నారు. కాలిఫోర్నియా నుంచి వచ్చిన తనకు టీహబ్ లో సాంకేతిక రంగంలో అత్యంత ప్రతిభావంతులైన & సృజనాత్మక వ్యాపారవేత్తలను కలుసుకునే అవకాశం లభించిందని అన్నారు. దేశంలో అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా T-Hub త్వరగా పేరుతెచ్చుకోవటంలో ఆశ్చర్యం లేదంటూ ట్వీట్ చేశారు.


యూఎస్ రాయబారి హైదరాబాద్ నగరంలో ఇటీవల ప్రారంభించబడిన కొత్త యుఎస్ కాన్సులేట్ ను, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB)ని కూడా సందర్శించారు. అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

English summary

Hyderabad: టీహబ్‌ని సందర్శించిన అమెరికా రాయబారి.. ప్రశంసల వర్షం.. | US Ambassador Eric Garcetti praised startup incubator T-Hub during his India Visit

US Ambassador Eric Garcetti praised startup incubator T-Hub during his India Visit
Story first published: Saturday, May 27, 2023, 12:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X