home loan: సొంతిల్లు కొనుక్కోవడం సగటు మధ్యతరగతి వ్యక్తి ఆశ. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదలకు కొంత మద్ధతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీంతో ప్రధాని మోదీ ఆగస్టు 15 ప్రసంగంలో ఈ విషయంపై ఓ ప్రకటన చేశారు.
మోదీ ప్రభుత్వం గృహరుణాలపై 7.2 బిలియన్ డాలర్ల మేర వడ్డీ రాయితీ ఇవ్వడాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చిన కొద్ది తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ పథకం చివరి దశలో ఉందని తెలిపారు. 'నిబంధనలు ఖరారు చేయబడ్డాయి. ప్రధాని మోదీ చెప్పినట్లు ఇదొక పెద్ద పథకం. ఇందులో వడ్డీపై రాయితీ లభిస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం' అని ప్రకటించారు.

పట్టణ పేదల కోసం తీసుకువస్తున్నట్లు చెబుతున్న ఈ గృహ రుణ పథకం ఖరారైనట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. గతంలో 6 లక్షల వరకు రుణం మొత్తానికి మాత్రమే సబ్సిడీ అందుబాటులో ఉండేదని గుర్తు చేశారు. అప్పటి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్(CLSS)తో పోలిస్తే కొత్త పథకం పూర్తి భిన్నంగా ఉంటుందని వెల్లడించారు.
కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం ఈ పథకం అమల్లోకి రానుంది. రెండు నెలల్లో ఈ స్కీమ్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిద్వారా లోన్ మొత్తంలో 9 లక్షల వరకు 3-5 శాతం మధ్య వార్షిక వడ్డీ రాయితీ పొందే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. 20 ఏళ్ల కాలవ్యవధితో, 50 లక్షల లోపు గృహ రుణగ్రహీతలు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయిస్తారని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications