IPO News: తొలిరోజే లక్షకు రూ.40 లాభం ఇచ్చిన ఐపీవో.. బంపర్ లిస్టింగ్..
IPO News: ఈ వారంతో పాటు వచ్చే వారం కూడా మార్కెట్లోకి ఐపీవోలు వరుసగా క్యూ కట్టాయి. పైగా ఇటీవల మార్కెట్లోకి వస్తున్న ఐపీవోలు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయి.
ఈ క్రమంలో నేడు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన అర్బన్ ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ స్టాక్ షేర్లు పొందిన ఇన్వెస్టర్లకు తొలిరోజే మంచి రాబడులను అందించింది. ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లో కంపెనీ షేర్లు లిస్టయ్యాయి. కంపెనీ షేర్లు 41 శాతం ప్రీమియం ధరకు జరిగాయి. కంపెనీ ఒక్కో షేరును రూ.100కు ఇష్యూ చేయగా.. స్టాక్ రూ.141 ధరకు మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీంతో ఇన్వెస్టర్లకు తొలిరోజే భారీ లాభాలు వచ్చాయి.

అర్బన్ ఎన్విరో ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి గొప్ప స్పందన లభించింది. ఐపీవోకు 255.49 రెట్లు అద్భుతమైన స్పందనతో ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యింది. కంపెనీ 11.42 లక్షల షేర్లను ఐపీవో ద్వారా ఆఫర్ చేయగా.. ఇన్వెస్టర్ల నుంచి మెుత్తం 27.72 కోట్ల షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. జూన్ 12 నుంచి 14 వరకు ఇన్వెస్టర్ల కోసం ఈ ఐపీవో తెరవబడింది. మధ్యాహ్నం 1.18 గంటల సమయంలో స్టాక్ ధర రూ.148.05 వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

IPOలో వాటాదారు వికాస్ శర్మ 2.22 లక్షల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించగా.. మిగిలిన 9.2 లక్షల ఈక్విటీ షేర్లు తాజాగా జారీ కింద మార్కెట్లోకి విడుదల చేయబడ్డాయి. ఈ కంపెనీ వ్యర్థాల సేకరణ, రవాణా, సెగ్రిగేషన్ అండ్ డిస్పోజ్ వంటి సేవలతో సహా దేశవ్యాప్తంగా వ్యర్థ పదార్థాల నిర్వహణ పరిష్కారాలను, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్(MSW) సేవలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications