చాల మంది మహిళలకు ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకోవడంతోనే రోజంతా సరిపోతుంది. ఇక అందులో ఇంటి పని అంటే అసలు టైం సరిపోదు. అందుకే ఎక్కువ శాతం సిటీ నగరాల్లో ఇంటి పనికి పనిమనుషులు పెట్టుకుంటారు. ఒకోసారి పనిమనుషులు లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది అందులో ఇంటి పనికి మరీ ముఖ్యం. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని అర్బన్ కంపెనీ ఇప్పుడు ఇన్స్టంట్ మెయిడ్ సర్వీస్ అందిస్తుంది. 'ఇన్‌స్టా మెయిడ్స్' అనే ఈ కొత్త సర్వీస్ ముంబైలో ప్రారంభమైంది. ఈ సర్వీస్ ద్వారా పనిమనిషి కేవలం 15 నిమిషాల్లో మీ ఇంటికి చేరుకుంటుంది.

ప్రస్తుతం ఈ సర్వీస్ ప్రయోగాత్మకంగా నడుస్తోంది. అలాగే ఇతర నగరాల్లో ప్రారంభమవుతుందో లేదో చూడాలి. ప్రారంభ ఆఫర్ కింద, మీరు ఒక గంటకు రూ. 49 మాత్రమే చెల్లించాలి, అయితే అసలు ధర గంటకు రూ. 245. అర్బన్ కంపెనీ 'ఇన్‌స్టా మెయిడ్స్' అనే కొత్త సర్వీస్ ప్రారంభించింది. దీని కింద కస్టమర్లకు 15 నిమిషాల్లో పనిమనిషి లభిస్తుంది. దీనితో పాటు కంపెనీ 'క్విక్ కామర్స్' రంగంలోకి కూడా ప్రవేశిస్తోంది. ఈ సర్వీస్ ధర గంటకు రూ.245 అని కంపెనీ ఫేస్‌బుక్‌లో తెలిపింది. కానీ, ప్రారంభ ఆఫర్ కింద కస్టమర్‌లు గంటకు రూ.49కే ఈ సర్వీస్ లభిస్తుంది.
ఏ సర్వీస్ అందుబాటులో ఉంటాయి: మనీకంట్రోల్ ప్రకారం, ఈ సర్వీస్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దీనిని ముంబైలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అర్బన్ కంపెనీ ఇప్పటికే సేవలను అందిస్తున్న ఇతర నగరాల్లో దీనిని ప్రారంభిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
'ఇన్‌స్టా మెయిడ్స్'లో డిష్‌వాషింగ్, ఇల్లు ఊడ్చడం, ఇల్లు తుడవడం, వంట చేయడం వంటి చాల రకాల సర్వీసెస్ ఉంటాయి, వీటిని సాధారణంగా ఇంటి పనిమనిషి నిర్వహిస్తారు. అర్బన్ కంపెనీ ఇప్పటికే ఇంటి శుభ్రపరచడం, పెస్ట్ కంట్రోల్, బాత్రూమ్ & వంటగది శుభ్రపరచడం, సోఫా అలాగే కార్పెట్ శుభ్రపరచడం, చెదల పురుగుల నియంత్రణ, బెడ్ బగ్ నియంత్రణ, బొద్దింకలు, చీమలు వంటి కీటకాల నియంత్రణ వంటి చాల సేవలను అందిస్తోంది. దీనితో పాటు అర్బన్ కంపెనీ ఏసీ రిపేర్, ఇన్‌స్టాలేషన్ అండ్ అన్‌ఇన్‌స్టాలేషన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్ అలాగే పెయింటింగ్ వంటి సేవలను కూడా అందిస్తుంది.
క్విక్ కామర్స్ రంగం విస్తరిస్తోంది: కంపెనీ క్విక్ కామర్స్ రంగంలో కొంతకాలం క్రితం ప్రారంభమైంది. మొదట 10-15 నిమిషాల్లో కిరాణా సామాగ్రిని డెలివరీ చేయడంతో ప్రారంభమైంది. కానీ, ఇప్పుడు మందులు, ప్రింటౌట్లు, బట్టలు, స్నాక్స్, బ్యూటీ ఉత్పత్తులకు చేరుకుంది. ఇప్పుడు అర్బన్ కంపెనీ 'ఇన్‌స్టా మెయిడ్స్'తో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించింది. 'ఇన్‌స్టా మెయిడ్స్' ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి అలాగే ఇతర నగరాల్లో కూడా సేవలను అందించగలిగితే ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సర్వీస్ ద్వారా, ప్రజలు ఇంటి పనులకు ఇన్స్టంట్ హెల్ప్ పొందగలుగుతారు, అంతేకాదు ఈ ఆలోచన నేటి బిజీ జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సేవ ద్వారా అర్బన్ కంపెనీ పనిమనిషి అవసరం ఉంటె వారి కోసం వెతకడానికి సమయం వృధా చేయకుండా నిమిషాల్లో పనిమనిషిని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా రూ.49కే అండ్ ఈ ఆఫర్ ప్రజలను 'ఇన్‌స్టా మెడ్స్' ప్రయత్నించమని ప్రోత్సహిస్తుంది. ఈ సేవ విజయవంతమైతే, ప్రజలు ఇంటి పనులలో సహాయం పొందే విధానాన్ని మార్చవచ్చు. ఈ సేవ ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటుందా లేదా అండ్ అర్బన్ కంపెనీ దీన్ని రూ.49కి ఎక్కువ కాలం అందించగలదా అనేది చూడాలి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications