Uranium Stock: ఒక్కసారిగా పెరిగిన యురేనియం స్టాక్.. కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు..!!
Uranium Stock: ఇంధన సంక్షోభం మధ్య అణుశక్తి ప్రయోజనాలను వినియోగించేందుకు ప్రపంచ నాయకులు మెుగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యురేనియం నిల్వలను ప్రపంచ దేశాలు పెంచుకుంటున్నాయి. భారత్‌తో సహా చాలా దేశాలు అణుశక్తి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నాయి. ఒకప్పుడు న్యూక్లియర్ పవర్ అంటే ఆందోళన చెందే దేశాలు సైతం ఇప్పుడు దానిని వినియోగించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
యురేనియం ఉత్పత్తి..
యురేనియం మైనింగ్ కంపెనీ కామెకో(cameco) షేర్లు ప్రస్తుతం భారీగా పెరుగుతున్నాయి. అయితే గ్లోబల్ యురేనియం X ఈటీఎఫ్ సైతం పెరుగాయి. అదేవిధంగా గత వారంలో కామెకో షేర్లు 28 శాతానికి పైగా పెరిగాయి. యురేనియం ఈటీఎఫ్ దాదాపు 20% వరకు పెరిగింది. ఇదిలా ఉంటే ఇంధన రంగంపై ఎంతో శ్రద్ధ చూపుతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా అణు విద్యుత్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం..
రష్యా ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభించిన ఆరు నెలల తర్వాత అణు పరిశ్రమలో పునరుజ్జీవం వచ్చింది. రష్యా చమురు మార్కెట్‌లపై ఆంక్షలు పెరగడంతో ఇంధన ధరలు పెరిగాయి. రష్యా ఐరోపాకు సహజ వాయువు ఎగుమతులను తీవ్రంగా తగ్గించింది.

OPEC దేశాలు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానంతరం ఇంధనం కోసం ప్రపంచం కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఒపెక్ దేశాలు తమ ముడి చమురు ఉత్పత్తిని పెంచలేదు. ఈ క్రమంలో అణుశక్తిపై ఆలోచన చాలా దేశాల్లో మారిపోయింది. అయితే యురేనియం వ్యర్థాలను సరిగ్గా, సురక్షితంగా నిల్వ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది.

చౌకగా విద్యుత్..
అణు ఆధారిత విద్యుత్ ప్లాంట్ నిర్మాణం తర్వాత పనిచేయడానికి చాలా చౌకగా ఉంటుంది. ఈ సందిగ్ధతను గ్రహించిన బెల్జియం తన రెండు అణు విద్యుత్ ప్లాంట్ల లైసెన్సులను పొడిగించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ జాబితాలో అమెరికా, ఫ్రాన్స్‌లు చేరాయి.

జపాన్ పవర్ ప్లాంట్..
ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరగటంతో కరెంట్ ఛార్జీలు 10 రెట్లు పెరిగాయి. జపాన్‌లోని ఫుకుషిమా న్యూక్లియర్ విద్యుత్ ప్లాంట్‌ను సునామీ ధ్వంసం చేసిన 10 ఏళ్ల తర్వాత.. కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం అనుమతులను ఇస్తోంది. డిమాండ్ కు తగినట్లుగా విద్యుత్ తయారీ ఉండేలా చూసుకునేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications