Multibagger stocks: రాత్రికి రాత్రో లేక స్వల్ప కాలంలోనే కోటీశ్వరులు కావాలనుకునే వారికి స్టాక్ మార్కెట్ అస్సలు సరైన ప్లేస్ కాదు. ఒక వేళ మీరు సరైన స్టాక్ లో పెట్టుబడి పెట్టినప్పటికీ దానిని కొనసాగించకపోతే మంచి రాబడులను మిస్ అవుతారు. దీర్ఘకాల్లో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించి కోటీశ్వరులుగా మార్చిన పెన్నీ స్టాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దీర్ఘకాలంలో రాబడినిచ్చిన స్టాక్స్..
దీర్ఘకాలికంగా బలమైన రాబడిని ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచిన స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్‌లు ఉన్నాయి. 20 ఏళ్లలో తమ ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చిన రెండు స్టాక్‌ల గురించి ఈ రోజు తెలుసుకోండి. వాటిలో మెుదటిది UPL లిమిటెడ్ స్టాక్, రెండవది లుపిన్ లిమిటెడ్ కంపెనీ షేర్. ఈ కంపెనీల్లో 20 ఏళ్ల కిందట లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం కోటీశ్వరులు అయి ఉండేవారు.

షేర్ ధర చరిత్ర..
UPL లిమిటెడ్ షేర్ జూలై 5, 2002న రూ.1.20 స్థాయి నుంచి ఆగస్టు 5, 2022 నాటికి రూ.742.50లకు చేరుకుంది. అంటే.. గత 20 ఏళ్లలో దాదాపు 61,775.00 శాతం మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. ఇదే సమయంలో.. లుపిన్ లిమిటెడ్ షేర్లు జనవరి 8, 1999న రూ.2.33 వద్ద నుంచి 5 ఆగస్టు 2022న రూ.669.40కి పెరిగింది. అంటే.. గడచిన 23 ఏళ్ల కాలంలో ఈ స్టాక్ 28,629.61 శాతం రాబడిని అందించింది.

లక్షను కోట్లుగా మార్చిన స్టాక్..
UPL లిమిటెడ్ షేర్‌లో రూ. 1.20 చొప్పున ఇన్వెస్టర్ రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ సుమారు రూ.6 కోట్లకు పైగా చేరుకుని ఉండేది. మరోవైపు.. ఒక పెట్టుబడిదారుడు రూ.2.33 రేటు వద్ద లుపిన్ లిమిటెడ్ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే.. ఈ రోజు దాని విలువ దాదాపు రూ.2.87 కోట్లుగా ఉండేది.
Note: పైన అందించిన సమాచారం కేవలం అవహాగన కోసం మాత్రమే. దీని ఆదారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ రిస్క్ తో కూడుకున్నది. పెట్టుబడులు పెట్టడానికి ముందు మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications