UPI: భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) వ్యవస్థ ఇప్పుడు సరిహద్దులు దాటి విదేశాలకూ చేరుకుంది. అత్యంత వేగంగా, తేలికగా చెల్లింపులు జరిపే ఈ పద్ధతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలని ఇండియా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో అంచెలంచెలుగా మెరుగవుతూ.. కొంతమేర విజయం సాధించింది కూడా. ప్రభుత్వ ప్రోత్సాహమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
2018-2022 మధ్య కాలంలో UPI ద్వారా జరిగిన పేమెంట్స్ విలువ 1,320 శాతం పెరగ్గా.. వాల్యూమ్ పరంగా 1,876 శాతం ఎగబాకాయి. అంటే 2018లో 374.63 కోట్ల చెల్లింపులు చేయగా.. 2022 నాటికి ఈ సంఖ్య 7 వేల 404 కోట్లకు చేరుకుంది. 2018లో 5.86 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్ జరపగా.. 2022లో 83.2 లక్షల కోట్లకు పెరిగాయి.

ఇండియాను సందర్శించే NRIలు ఇక్కడ ఉన్నప్పుడు UPI ఉపయోగించి చెల్లింపులు చేయడానికి RBI ఫిబ్రవరిలో అవకాశం కల్పించింది. అయితే బెంగళూరు, ముంబై మరియు న్యూఢిల్లీ వంటి ఎంపిక చేసిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో G20 దేశాల నుంచి వచ్చే సందర్శకుల పేమెంట్స్ కు సైతం విస్తరించింది.

ఇదేకాక సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, USA, సౌదీ అరేబియా, UAE, UK వంటి 10 దేశాలకు ఈ సౌకర్యం అనుమతించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. కాగా UPI నిర్వహణను ఈ సంస్థే చేపడుతోంది. NIPL ద్వారా UPIని అంతర్జాతీయంగా విస్తరించేందుకు పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications