For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రాన్సాక్షన్స్‌లో యూపీఐ హవా, డెబిట్ కార్డు ఉపయోగం తగ్గుతుంది!

|

రిటైల్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ప్లాట్‌ఫామ్ UPI డిజిటల్ చెల్లింపుల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నట్లు పీడబ్ల్యుసీ ఇండియా నివేదిక తెలిపింది. బై నౌ పే లేటర్ (BNPL), సెంట్రల్ బ్యాంకు కరెన్సీ (CBDC) ట్రాన్సాక్షన్స్ కూడా వచ్చే అయిదేళ్ల కాలంలో డిజిటల్ చెల్లింపుల్లో గణనీయ వృద్ధికి కీలకంగా మారనున్నాయని పేర్కొంది. భారత్ డిజిటల్ చెల్లింపుల మార్కెట్ 23 శాతం స్థిర వార్షిక సంచిత వృద్ధి రేటును నమోదు చేస్తున్నట్లు తెలిపింది.

2025-26 నాటికి రూ.21,700 కోట్ల ట్రాన్సాక్షన్స్ డిజిటల్‌గా జరుగుతాయని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5900 కోట్ల ట్రాన్సాక్షన్స్ నమోదయ్యాయి. ఈ మేరకు ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్ బుక్ 2021-26 పేరుతో పీడబ్ల్యుసీ ఇండియా నివేదిక రూపొందించింది. 2020-21లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ రూ.2200 కోట్లకు చేరాయి. 2025-26 నాటికి రూ.16500 కోట్లకు చేరే అవకాశముందని, అంటే 122 శాతం వృద్ధి రేటు అని పేర్కొంది.

UPI to stay on top, Debit card usage to drop

ఇదిలా ఉండగా, ఏటీఎం నుండి యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ కోసం ఆర్బీఐ ముందుకు సాగుతోంది. ఇది డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ పైన ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఏటీఎం నుండి యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ భారీ ప్రభావం చూపుతుందని అంటున్నారు.

English summary

ట్రాన్సాక్షన్స్‌లో యూపీఐ హవా, డెబిట్ కార్డు ఉపయోగం తగ్గుతుంది! | UPI to stay on top, Debit card usage to drop

The RBI’s push to enable UPI-backed cash withdrawals from ATMs is likely to cause a severe dent in the usage of debit cards, according to payment industry executives.
Story first published: Monday, April 18, 2022, 9:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X