UPI: భారత పేమెంట్స్ వ్యవస్థ UPI రికార్డులు సృష్టిస్తోంది. అగ్ర రాజ్యాలకు సైతం సాధించలేని ఘనతను UPI ద్వారా ఇండియా తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పుడు తన పాత రికార్డులను చెరిపేస్తూ, కొత్త శిఖరాలకు దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన ఓ నివేదిక.. దేశంలో UPI సత్తాను మరోసారి తెలియజేసింది.
'ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్‌బుక్ - 2022-27" పేరుతో PwC ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం, 2026-27 నాటికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు క్రమంగా పెరుగుతూ, రోజుకు 1 బిలియన్ లావాదేవీల మార్కుని చేరుకుంటాయని తెలిపింది. దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో UPI కీలకపాత్ర పోషించగా.. 2022-23 మధ్య రిటైల్ విభాగం మొత్తం లావాదేవీల్లో దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించింది.

రిటైల్ డిజిటల్ పేమెంట్స్లో UPI ఆధిపత్యం మరింత పెరగనుందని PwC నివేదిక అంచనా వేసింది. రాబోయే ఐదేళ్లలో మొత్తం లావాదేవీల్లో 90 శాతం UPI ద్వారానే జరుగుతాయని అభిప్రాయపడింది. ఇప్పటికే భారతీయ డిజిటల్ చెల్లింపుల మార్కెట్ స్థిరమైన వృద్ధిని సాధించింది. లావాదేవీ పరిమాణంలో 50 శాతం CAGRతో హవా కొనసాగిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ లావాదేవీల సంఖ్య 103 బిలియన్ల కాగా.. 2026-27 నాటికి 411 బిలియన్లకు పెరుగుతుందని. పేర్కొంది.
ఈ వృద్ధి పథం కొనసాగుతుందని నివేదిక అంచనా వేసింది. UPI లావాదేవీలు 2022-23లో 83.71 బిలియన్ల నుండి 2026-27 నాటికి 379 బిలియన్లకు గణనీయంగా పెరుగుతాయని తెలిపింది. UPI తర్వాత రిటైల్ డిజిటల్ చెల్లింపులకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లతో సహా కార్డ్ చెల్లింపులు ప్రాముఖ్యత కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 2024-2025 నాటికి క్రెడిట్ కార్డ్ లావాదేవీలు.. డెబిట్ కార్డ్ పేమెంట్స్ ను అధిగమిస్తాయని భావిస్తోంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications